బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవచ్చని, ఫలితంగా సూచీలు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడే వీలుందని చెబుతున్నారు. అంతకుముందు రెండు వారాలు వరుస లాభాలతో జోష్ మీదున్న స్టాక్ మార్కెట్లు గత వారం నష్టాలపాలయ్యాయ. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 227.59 పాయింట్ల్లు క్షీణించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 52.05 పాయింట్లు కోల్పోయంది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) కూడా ముగింపు దశకు చేరుకోవడం, నెలసరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు తీరిపోనుండటంతో ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లకు ఆటుపోట్లు తప్పవన్న అంచనాలు మార్కెట్ విశే్లషకుల నుంచి వస్తున్నాయ. ఆమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ రిసెర్చ్ అధిపతి, డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయతే దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని బిజెపి సొంతం చేసుకున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు సంస్కరణల బాట పడుతుందని మదుపరులు గట్టిగా విశ్వసిస్తున్నట్లూ వారు చెబుతున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌తోపాటు ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన మెజారిటీని సాధించినది తెలిసిందే. మణిపూర్, గోవా రాష్ట్రాల్లోనూ మద్దతుదారులతో కలిసి అధికారాన్ని దక్కించుకుంది. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయతే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో లోక్‌సభలో ఇప్పటికే బలం కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ బలం పెరగనుంది. దీంతో ఆర్థిక సంస్కరణల విషయంలో ఇప్పుడే దూకుడు ప్రదర్శిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరింతగా సంస్కరణలను ప్రవేశపెడతారన్న నమ్మకం మదుపరులలో కనిపిస్తోందని, దీంతో పెట్టుబడులు పోటెత్తడం ఖాయమన్న అభిప్రాయాలూ మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయ. ‘ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి సాధించిన విజయం మార్కెట్లకు కొత్త జోష్‌ను తెప్పించడం ఖాయం. ముఖ్యంగా ఈ విజయం రాజ్యసభలో బిజెపి బలాన్ని పెంచుతుంది. దీంతో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు ఆస్కారముంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో మాత్రమే బిజెపికి ఆధిక్యం ఉండటంతో కీలకమైన బిల్లులు, నిర్ణయాలకు రాజ్యసభ నుంచి ఆమోదం లభించడం కష్టతరమవుతోంది. కానీ ఉత్తరప్రదేశ్ గెలుపుతో రాజ్యసభలోనూ బిజెపి బలపడనుంది. ఇది మోదీ అధికార పరిధిని మరింత పెంచుతుంది.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే రాష్టప్రతి ఎన్నికలోనూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిది పైచేయగా నిలుస్తుందని సింఘానియా చెప్పారు. కాగా, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.