బిజినెస్

పారిశ్రామిక పార్కుల్లో ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: పారిశ్రామికవాడల్లో భూముల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్టు టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన చిన్న తరహా పరిశ్రమల యజమానులు బాలమల్లును ఆయన కార్యాలయంలో మంగళవారం కలిశారు. పారిశ్రామిక పార్కులో స్థలాలు కేటాయించాలని కోరారు. దీంతో నూతన పారిశ్రామిక విధానం ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఎవరైనా పరిశ్రమలు స్థాపించవచ్చునని బాలమల్లు చెప్పారు. పాత పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను ఈ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తామని చెప్పారు. కొత్త పారిశ్రామిక పార్కుల్లో రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వర్గాలకు ముందుగానే స్థలాలను రిజర్వ్ చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, సబ్సిడీలను ఉపయోగించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు టిఎస్‌ఐఐసి తరఫున ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ పారిశ్రామికవేత్తల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె సుధీర్‌రెడ్డి, బాలానగర్, గాంధీనగర్ పారిశ్రామికవాడలకు చెందిన ఎస్సీ, ఎస్టీ బిసి చిన్నతరహా పరిశ్రమల యజమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థకు కొత్త బోర్డు
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థకు కొత్తగా బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. టిఎస్‌ఐడిసి చైర్మన్ ఈ బోర్డుకు కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వివిధ శాఖలకు చెందిన ఆరుగురు ఉన్నతాధికారులను డైరెక్టర్లుగా నియమించారు. ఈ బోర్డులో దాదాపు అందరూ ఐఎఎస్ అధికారులే ఉండటం గమనార్హం. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.