బిజినెస్

ఎస్‌బిఐ ‘జన్‌ధన్’ వ్యయం రూ. 775 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. జన్‌ధన్ ఖాతాల నిర్వహణ వ్యయం 775 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. జన్‌ధన్ ఖాతాలు అన్ని బ్యాంకుల్లో తెరిచినప్పటికీ, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పిఎమ్‌జెడివై) నిర్వహణ వ్యయాన్ని ఎస్‌బిఐ మాత్రమే ప్రకటించిందని, నిరుడు డిసెంబర్ 31 నాటికి ఈ వ్యయం 774.86 కోట్ల రూపాయలుగా ఉందని మంత్రి చెప్పారు.
కాగా, మరో ప్రశ్నకు బదులిస్తూ నిరుడు నవంబర్ 9 నాటికి 5.93 కోట్లుగా ఉన్న జన్‌ధన్ ఖాతాలు.. డిసెంబర్ 28కల్లా 6.32 కోట్లకు చేరాయని మంత్రి తెలియజేశారు. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పిఎమ్‌జెడివై పథకాన్ని తీసుకొచ్చినది తెలిసిందే. ఇందులోభాగంగా జిరో బ్యాలెన్స్ ఖాతాలను బ్యాంకులు నిరుపేదల కోసం తెరిచాయి. అయితే రోజులు గడుస్తున్నకొద్దీ వీటి నిర్వహణ భారం బ్యాంకులకు పెరిగిపోయింది. ముఖ్యంగా జన్‌ధన్ ఖాతాలు అధికంగా ఉన్న బ్యాంకుల్లో ఎస్‌బిఐనే ముందుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఈ జన్‌ధన్ ఖాతాల నిర్వహణ వ్యయాన్ని తట్టుకోవడానికి, ఖాతాల్లో కనీస నగదు మొత్తంగా 5,000 రూపాయల నిబంధనను ఎస్‌బిఐ తెచ్చింది. వచ్చే నెల 1 నుంచి దీన్ని అమలు కూడా చేస్తోంది. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం సైతం పునరాలోచించుకోవాలని సూచించింది. కాగా, నిరుడు నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు జరగగా, నవంబర్ 9 నాటికి దేశంలోని జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న నగదు 45,636 కోట్ల రూపాయలని, అయితే డిసెంబర్ 28 నాటికి ఇది 71,036 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి స్పష్టం చేశారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత పెద్ద నోట్లను మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే. ఈ క్రమంలో రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లోగల తమ ఖాతాల్లో జమ చేసుకుని, కొత్తగా తెచ్చిన నోట్లను తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే ఏయే ఖాతాల్లో ఎంత మొత్తం నగదు డిపాజిట్ అవుతుందో గమనించింది. దీంతో అక్రమార్కుల చూపు జన్‌ధన్ ఖాతాలపై పడగా, పెద్ద ఎత్తున వీటిని నల్లధనం మార్పిడికి వినియోగించుకున్నట్లు తేలడంతో జన్‌ధన్ ఖాతా లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 13 ప్రైవేట్‌రంగ బ్యాంకులు ఈ నెల 24 నాటికి 92,52,609 జన్‌ధన్ ఖాతాలను స్తంభింపజేశాయి. గడచిన ఏడాది కాలంలో లావాదేవీల సమస్యే కారణం. అయినప్పటికీ ఇంకా 28.02 కోట్ల జన్‌ధన్ ఖాతాలున్నాయని, వీటిలో 1.8 కోట్ల ఖాతాల్లో 5,000 రూపాయల కంటే పైచిలుకు నగదు ఉందని సదరు బ్యాంకులు తెలిపినట్లు మంత్రి రాజ్యసభకు వివరించారు.
రూ. 600 కోట్లు స్వాధీనం
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 600 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను ఆదాయ పన్ను శాఖ స్వాధీనం చేసుకున్నట్లు రాజ్యసభకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను నిరుడు నవంబర్ 8న కేంద్రం రద్దు చేయగా, అప్పటి నుంచి జనవరి 10 వరకు 1,100 కేసులకుపైగా ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది.