బిజినెస్

నష్టాల నివారణలో ఈపీడీసీఎల్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 23: విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడంలో దేశంలోనే ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపీడీసీఎల్) అగ్రగామిగా నిలిచింది. దేశంలో 48 విద్యుత్ పంపిణీ సంస్థలుండగా, అందులో ఈపీడీసీఎల్ ఒక్కటే విద్యుత్ నష్టాలను 5.48 శాతానికి తగ్గించి మొదటి స్థానంలో నిలిచింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను దేశంలోని మిగిలిన విద్యుత్ పంపిణీ సంస్థలన్నీ 8 నుంచి 15 శాతం వరకు విద్యుత్ నష్టాలు కలిగి ఉండగా, ఈపీడీసీఎల్ పరిధిలో మాత్రం 18 శాతం నుంచి క్రమేపీ తగ్గుకుంటూ 5.48 శాతానికి వచ్చాయ. దీన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరింత తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్ లోడ్ పెరిగినపుడు, విద్యుత్ చౌర్యం జరిగినా, విద్యుత్ లైన్ల నాణ్యత లోపించిన పరిస్థితులు పంపిణీ నష్టాలకు దారితీస్తుంటాయి. అయతే ఈ నష్టాలను తగ్గించడం కోసం గత నాలుగేళ్ళుగా సంస్థ అత్యంత అధునాతన, సామర్థ్యం కలిగి ఉండే సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌పార్మర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే సబ్‌స్టేషన్ల దూరాన్ని తగ్గించింది. దీనివల్ల లోడ్ పెద్దగా ఉండకపోగా మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందివ్వగలుగుతోంది. అందువల్లే ప్రతి ఏడాది పంపిణీ నష్టాలను తగ్గించగలుగుతోంది. సంస్థ ఏర్పడిన తొలి సంవత్సరం 2000-01లో 17.91 శాతం మేర ఉన్న విద్యుత్ నష్టాలు ఆ తరువాత 2001-02లో 17.28, 2002-03లో 16.80, 2003-04లో 15.29 శాతం మేర తగ్గించకుంటూ రాగలిగింది. ఈ విధంగా 2004-05లో 15.17, 2005-06లో 12.95, 2006-07లో 12.29, 2007-08లో 9.01, 2008-09లో 8.83, 2009-10లో 7.90 శాతం మేర విద్యుత్ నష్టాలు తగ్గాయి. అంటే పదేళ్ళకాలంలో సగానికి పైగా విద్యుత్ నష్టాలను తగ్గించగలిగిన సంస్థల్లో ఇదే అగ్రగామిగా నిలిచింది. ఈ క్రమంలో 2010-11లో 7.90, 2010-11లో 7.09, 2011-12లో 6.91, 2012-13లో 6.46, 2013-14 లో 6.33, 2014-15లో 6.32, గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను దీనిని ఏకంగా 5.48 శాతానికి తగ్గించి దేశంలోని 48 విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఈపీడీసీఎల్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే అగ్రగామిగా నిలిచింది. ఆంధ్ర రాష్ట్రంలో రెండు డిస్కామ్‌లుండగా, ఇందులో ఐదు జిల్లాలతో కూడిన ఈపీడీసీఎల్, మరో ఎనిమిది జిల్లాలకు సంబంధించి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఎస్‌పీడీసీఎల్) ఉన్నాయి. ఇవిగాకుండా తెలంగాణ పరిధిలో మరో రెండు డిస్కామ్‌లున్నాయి. వీటన్నింటిలో కంటే కూడా విద్యుత్ నష్టాలను ప్రతి ఏడాది ఈపీడీసీఎల్ మాత్రమే గణనీయంగా తగ్గించగలుగుతోంది. కనీస స్థాయికి విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గించడంపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజును అభినందించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ రానున్న మూడేళ్ళకాలంలో ఈ నష్టాలను నాలుగు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్‌మెన్ నుంచి ఇంజినీర్ల వరకు శ్రమించడం వల్లే ఈ ఫలితాలు సాధించగలిగామన్నారు.