బిజినెస్

పెరిగిన పాల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విశాఖపట్నం (అక్కిరెడ్డిపాలెం), మార్చి 31: పాల ధరలు పెరిగాయ. శనివారం నుంచి విజయ, విశాఖ డెయిరీ పాల ఉత్పత్తులు మరింత ప్రియమయ్యాయ. విజయ బ్రాండ్ పాల ధరను లీటరుకు రూపాయి పెంచగా, పాల సేకరణ ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. మరోవైపు విశాఖ డెయిరీ విక్రయించే లీటర్ ప్యాకెట్‌పై రెండు రూపాయల చొప్పన పెంచుతూ శుక్రవారం సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో పాడి రైతులు పోసే పాలకు కూడా రెండు రూపాయలు పెంచుతూ ఉత్తర్వులను ఇప్పటికే ఆయా పాల సేకరణ కేంద్రాలకు డెయిరీ యాజమాన్యం పంపింది. కాగా, కూలి వ్యయం, దాణా ముడి సరుకులు, పశు గ్రాసం ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల లీటరుకు రెండు రూపాయల సేకరణ ధర పెంచినట్టు ప్రకటించింది విజయ డెయరీ. మరోవైపు విశాఖ డెయరీ.. పాల ఉత్పత్తులపై చివరిసారిగా 2014లో ధరలు పెంచింది. అయతే ప్రస్తుతం విశాఖ డెయిరీ విక్రయించే పాలపైనే ధరలు పెంచింది. వేసవిలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్న తరుణంలో డెయిరీ ఈ నిర్ణయం తీసుకుంది. డబుల్ టోన్డు పాలు 500 మిల్లీ లీటర్ల పాత ధర 18 రూపాయలు అవగా, కొత్త ధర 19 రూపాయలకు చేరుకుంది. టోన్డు పాలు 500 మిల్లీ లీటర్ల పాత ధర 20 రూపాయలు అవగా, కొత్త ధర 21 రూపాయలకు పెరిగింది. లీటర్ పాలు పాత ధర 40 రూపాయలవగా కొత్త ధర 42 రూపాయలకు పెరిగింది. స్టాండర్డ్‌డైజ్డ్ మిల్క్ 500 మిల్లీ లీటరు పాత ధర 22 రూపాయలు కాగా, కొత్త ధర 23 రూపాయలకు చేరుకుంది. పుల్ క్రీమ్ పాలు 500 మిల్లీ లీటర్ల పాలు 24 రూపాయలు అవగా, కొత్త ధర 25 రూపాయలకు పెరిగింది. హోమోనైజ్డ్ టోన్డు పాలు 200 మిల్లీ లీటర్ల ధర పెరగలేదు. గంగా 500 మిల్లీ లీటరు పాలు 21 కాగా కొత్త ధర 22 రూపాయలకు విక్రయిస్తారు. పెరిగిన పాల ధరలు ఏఫ్రిల్ 1 నుండి అమల్లోకి వస్తున్నట్లు డెయిరీ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. విజయ డెయరీ సైతం శనివారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని చెప్పింది. ఆవుపాలు, గేదె పాలకు నికరంగా లీటరుకు రెండు రూపాయల పెంపుదల శనివారం నుంచి అమలులోకి వస్తుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.