బిజినెస్

27న ఎయిర్‌టెల్ పరిశీలనకు షేర్ బైబ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. ఈ నెల 27న షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించనుంది. ఆ రోజు జరిగే సంస్థ బోర్డు సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రానుంది. అయితే ఈ బైబ్యాక్ ఆఫర్ ద్వారా ఎన్ని షేర్లను తిరిగి కొనుగోలు చేయనుందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను తుది డివిడెండ్‌పైనా ఈ సమావేశంలో ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకోనుంది. కాగా, నిరుడు డిసెంబర్ నాటికి ఎయిర్‌టెల్ నికర రుణాలు 78,816 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.