బిజినెస్

మెరిసిన మెటల్, రియల్టీ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో వారం లాభాల్లో ముగిశాయి. మెటల్, బ్యాంకిం గ్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిన నేపథ్యంలో గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 211.39 పాయింట్లు పెరిగి 25,838.14 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 48.85 పాయింట్లు అందిపుచ్చుకుని 7,899.30 వద్ద నిలిచింది. ఇక అంతకుముందు వారంతో కూడా చూస్తే ఈ రెండు వారాల్లో సెనె్సక్స్ 1,164.30 పాయింట్లు పుంజుకుంటే, నిఫ్టీ 344.10 పాయింట్లు ఎగిసింది. ఈసారి వర్షాలు సాధారణం కంటే అధికంగా కురుస్తాయన్న అంచనాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అభిప్రాయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. వరుసగా 16వ నెల ఎగుమతులు క్షీణించడం ఈ అభిప్రాయాలకు ఊతమిచ్చాయి. అలాగే మార్చి నెలకుగాను విడుదలైన టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు వరుసగా 17వ నెలా మైనస్‌లోనే నమోదవడం.. మదుపరులను కొనుగోళ్ల దిశగా నడిపించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం రికార్డు స్థాయిలో నమోదవడం, దేశీయ రెండో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభాలు కూడా ఆకర్షణీయంగా ఉండటం కలిసొచ్చింది. అయితే విప్రో లాభం గతంతో పోల్చితే కాస్త పడిపోవడం, దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ లాభాలు బాగానే ఉన్నా.. అమెరికా కోర్టు జరిమానా నేపథ్యంలో ఈ సంస్థల షేర్ల విలువ దిగజారింది. ఇకపోతే గడచిన వారం విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ) దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 2,163.87 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను తెచ్చారు. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 0.94 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 1.24 శాతం పెరిగా యి. ఆయా రంగాల వారీగా గడచిన వారం మెటల్ 4.76 శాతం, రియల్టీ 4.08 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.07 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.01 శాతం, విద్యుత్ 0.81 శాతం, చమురు, గ్యాస్ 0.6 6 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే ఎఫ్‌ఎమ్‌సిజి 0.68 శాతం, ఆటో 0.26 శాతం చొప్పున నష్టపోయాయి. టర్నోవర్ విషయానికొస్తే బిఎస్‌ఇ 10,743. 69 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 75,491.52 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 8,967.91 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 50,35 3.08 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.