బిజినెస్

హమ్మయ్య.. అమ్మేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 8: ఎట్టకేలకు గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లా అమ్ముడుపోయంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్‌కు ఇచ్చిన రుణాలకుగాను తాకట్టు పెట్టుకున్న స్థిరచరాస్తుల్లో కింగ్‌ఫిషర్ విల్లా ఒకటన్నది తెలిసిందే. బకాయల వసూళ్లలో భాగంగా ఇతర ఆస్తులతోపాటు దీన్నికూడా మూడుసార్లు బ్యాంకులు వేలం వేశాయ. అయనప్పటికీ స్పందన మాత్రం శూన్యం. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌గా జరిగిన చర్చల ద్వారా నటుడు సచిన్ జోషి ఈ విల్లాను కొనుగోలు చేశారు. ‘వౌనమేలనోయ’, ‘నినుచూడక నేనుండలేను’, ‘ఒరేయ్ పండు’, ‘నీజతగా నేనుండాలి’, తదితర తెలుగు చిత్రాలతోపాటు హిందీ చిత్రాల్లో సచిన్ జోషి హీరోగా నటించారు. కాగా, నిరుడు అక్టోబర్‌లో 85.29 కోట్ల రూపాయలుగా ఉన్న దీని ధర.. డిసెంబర్ వేలంలో 81 కోట్ల రూపాయలకు పడిపోయంది. ఆ తర్వాత గత నెల మార్చి 6న జరిగిన వేలంలో 73 కోట్ల రూపాయలకు దిగివచ్చింది. అయనప్పటికీ కొనేవారే లేకపోయారు. ఈ క్రమంలోనే సచిన్ జోషి కొనుగోలు చేశారు. అదికూడా బ్యాంకర్లు నిర్ణయంచిన ధరకే కావడం గమనార్హం. ‘వరుసగా వేలం ప్రక్రియ విఫలమవుతున్న నేపథ్యంలో నిర్దేశిత ఆస్తి అమ్మడం కోసం ప్రైవేట్ చర్చలకు వెళ్లడానికి బ్యాంకులకు హక్కు ఉంటుంది. అందులో భాగంగానే ఈ వారం ఆరంభంలో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా 73.01 కోట్ల రూపాయలకు సచిన్ జోషి విల్లాను కొన్నారు.’ అని ఈ లావాదేవీలను తెలిసిన ఒకరు పిటిఐకి చెప్పారు. అయతే దీన్ని వ్యాపారి కూడా అయన సచిన్ జోషి మాత్రం ధ్రువీకరించేందుకు నిరాకరించారు. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దగల కింగ్‌ఫిషర్ విల్లా 12,350 చదరపు అడుగులకుపైగా స్థలం లేదా మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించారు. విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితానికి ఈ విల్లా ప్రతిరూపంగా నిలుస్తుంది. అబ్బుపరిచే ఇంటీరియర్ డిజైనింగ్ దీని సొంతం. 2016 మే నెలలో దీన్ని బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయ. కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ మాతృ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్.. ఈ విల్లా చట్టపరమైన యజమానిగా ఉంది. కాగా, ముంబయ లోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను కూడా అమ్మేందుకు బ్యాంకర్లు గట్టిగా ప్రయత్నిస్తున్నది తెలిసిందే. ముంబయ జాతీయ విమానాశ్రయం దగ్గర్లోగల విలే పార్లే ప్రాంతంలో 17 వేల చదరపు అడుగుల్లో నిర్మితమైంది కింగ్‌ఫిషర్ హౌస్. ఇక కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయ పడినది తెలిసిందే. తీసుకున్న రుణాలను చెల్లించలేక మాల్యా లండన్‌కు పారిపోగా, ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడంలో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మేందుకు బ్యాంకర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవాలోని విల్లా అమ్మకం బ్యాంకులకు ఒక విధంగా గొప్ప ఊరటగానే చెప్పొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి ఈ వేలాల్ని నిర్వహిస్తుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ కూటమిలో ఉన్నాయ. బ్యాంకర్ల తరఫున ఎస్‌బిఐ క్యాపిటల్ ట్రస్టీ వేలాలను నిర్వహిస్తోంది. విజయ్ మాల్యాను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించగా, ఈ వ్యవహారం కోర్టుల్లోకి కూడా చేరింది.

చిత్రం..సచిన్ జోషి