బిజినెస్

‘సెట్విన్ వాణిజ్య, ఉత్పాదక కేంద్రాల ద్వారా పుస్తకాల ముద్రణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: సెట్విన్ వాణిజ్య, ఉత్పాదక కేంద్రాలకు స్టేషనరీ, పుస్తకాలు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన ఫైల్స్ తయారు చేసే బాధ్యతను అప్పగిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని తెలంగాణ ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఈ మేరకు తగిన విధి విధానాలతో నివేదికను సమర్పించాలని అధికారులకు సూచించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ హాస్టళ్లకు పుస్తకాలు సరఫరా చేయడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు పని కల్పించినట్లు అవుతుందని చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో నిరుద్యోగులకు, మహిళలకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పలు అంశాలపై చర్చ నిర్వహించారు. ఈ సమావేశంలో యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బి వెంకటేశం, సెట్విన్ ఎండి వైధ్యనాథ్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి ఉమ, ఒఎస్‌డి ఎస్‌ఎం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జూన్ 3 నుంచి 5 వరకు మంత్రి పద్మారావు అమెరికా పర్యటన
అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ అభివృద్ధి ఫోరం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జూన్ 3 నుంచి 5 వరకు నిర్వహిస్తున్న గ్లోబల్ తెలంగాణ కనె్వన్షన్ 2016లో మంత్రి పద్మారావు పాల్గొననున్నారు. ప్రవాస భారతీయులు సైతం తమ వంతుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో తోడ్పాటు అందించాలని ఈ సభల ద్వారా మంత్రి కోరనున్నారు.