బిజినెస్

ధరలు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: బ్యాంకులు గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించేలా కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగ్గించాలని నిర్మాణరంగ వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇండ్లు, ఫ్లాట్లు, భూముల ధరలు తగ్గిస్తే కొనుగోళ్లు పెరుగుతాయని సూచిస్తున్నారు ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్. సోమవారం ఇక్కడ వైబి చవాన్ మెమోరియల్‌లో ప్రసగించిన రాజన్.. ధరలు తగ్గితే కొనుగోలుదారులు పెరుగుతారన్నారు. ‘వడ్డీరేట్లు తగ్గితే రుణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చి కొనుగోళ్లు పెరుగుతాయి నిజమే. అయితే రియల్టర్లు ధరలను తగ్గిస్తే కూడా వినియోగదారులు కొనుగోళ్ళకు ఆసక్తి కనబరుస్తారు.’ అని రాజన్ అన్నారు. ఈ నెల ఆరంభంలో జరిపిన ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ రెపో రేటు పావు శాతం తగ్గించి 6.5 శాతానికి తెచ్చినది తెలిసిందే. ఇదిలావుంటే లైసెన్సు రాకతో క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (సిఎస్‌ఎఫ్‌బి) కార్యకలాపాలు మొదలయ్యాయని, ఈ తరహా కార్యకలాపాలు ప్రారంభించిన తొలి సంస్థ సిఎస్‌ఎఫ్‌బినేనన్నారు.