బిజినెస్

మామిడికి ‘ఎల్‌నినో’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 25: మామిడి దిగుబడిపై ఈసారి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా చూపింది. కేవలం 60 శాతం మాత్రమే దిగుబడి దక్కింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా పరిధిలో విస్తారంగా పండే మామిడి ఈసారి దిగుబడి పడిపోవడంతో అనుబంధ పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. మార్కెట్‌లో మచ్చుకు కూడా మామిడి కనబడని పరిస్థితి దాపురించింది. ఎగుమతులు మృగ్యమవగా, స్థానిక మార్కెట్‌లో విపరీతంగా ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి సీజన్‌లోను వేలాది మంది ఎగుమతులపై ఆధారపడి జీవనోపాధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఉస్సూరుమంటున్నారు. మరోవైపు మామిడి దిగుబడి అంతంత మాత్రం కావడంతో ఇప్పటివరకూ మామిడికాయ మార్కెట్‌లో కనబడలేదు. దీంతో తాండ్ర పరిశ్రమ కూడా కుదేలైంది. తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయపురం, పండూరు, సర్పవరం తదితర ప్రాంతాల్లో ప్రధానంగా మామిడితాండ్ర పరిశ్రమ ఉంది. ఇప్పుడు కాయలు లేకపోవడం వల్ల ఇక్కడ పనులు మందగించాయి. దీనికితోడు ఆవకాయకు కూడా మామిడికాయ కరవు అవ్వడంతో పచ్చళ్ల పరిశ్రమకు కూడా విఘాతం కలిగింది. ఎల్‌నినో ప్రభావం వల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయ. ఫిబ్రవరి, మార్చి వరకు కూడా పూతదశకు రాలేదు. వాస్తవానికి డిసెంబరు నాటికి పూత రావాల్సి ఉంది. అక్కడక్కడ పూత వచ్చినా అదికాస్తా రాలిపోయింది. వాతావరణంలో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోవడంతో కాయలు విపరీతంగా దిగుబడి వచ్చే సమయానికి అంటే మార్చి నాటికి పూత పూసే స్థితికి వచ్చింది. ఈ క్రమంలో పూత రాలిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో 18,800 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో బంగినపల్లి, తోతాపురి, పెద్ద రసాలు, చిన్న రసాలు, కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ, పంచదార కల్తీ, చెరకు రసాలు వంటి రకాలు విస్తారంగా పండుతాయ. ఇందులో ప్రధానంగా బంగినపల్లి ఎగుమతికి మరింతగా అవకాశం ఉండటంతో ఇక్కడ నుండి ఢిల్లీ వంటి ప్రాంతాలకు విస్తారంగా ఎగుమతులు జరుగు తాయ. కానీ ఇప్పుడు దిగుబడి తగ్గిపోవడంతో ఎగుమతులు తగ్గాయి. ప్రధానంగా తుని వంటి ప్రాంతాల నుండి ఎగుమతులు విస్తారంగా జరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఎగుమతి ప్రాంతాలు బోసిపోయాయి. మరోవైపు ఎల్‌నినో ప్రభావం జీడిమామిడిపై కూడా చూపించింది. జీడిమామిడి ప్రధానంగా 33,257 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంది. ఏజెన్సీ ఏరియాలో 625 హెక్టార్ల విస్తీర్ణంలో ఆర్గానిక్ జీడిమామిడి సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ చర్యలు చేపట్టింది. ఈ తోటలు ప్రధానంగా కోరుకొండ, రాజానగరం, తుని, గోకవరం మండలంలో విస్తారంగా ఉన్నాయి. ఇదిలావుండగా మామిడిని మగ్గబెట్టేందుకు కార్బయిడ్ వినియోగించకుండా ఉద్యానవన శాఖ అధికారులు ముందు నుండి చర్యలు చేపట్టారు. రైతులు, వ్యాపారుల్లో అవగాహన పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. మార్కెట్‌లో కార్బయిడ్ రహిత ఉత్పత్తులు వచ్చేలా అవగాహన కల్పించారు.