బిజినెస్

ఆ ఫోన్ ధర రూ. 6 లక్షల పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న స్మార్ట్ఫోన్ ఒకటి త్వరలో మన ముందుకు రానుంది. వచ్చే నెలలో దీన్ని సిరిన్ ల్యాబ్స్ పరిచయం చేయనుంది. ‘సొలారిన్’ పేరిట మార్కెట్‌లోకి వస్తున్న ఈ ఫోన్ ధర ఆరు లక్షల రూపాయల పైనేనని తెలుస్తోంది. అవును.. ‘స్మార్ట్ఫోన్లలో రోల్స్ రాయిస్’గా అభివర్ణించబడుతున్న దీని ధర దాదాపు 10,000 డాలర్లు మరి. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే రూపాయికి ఉన్న విలువ ప్రకారం ఇది 6,66,200 రూపాయలకు సమానం. అత్యంత వ్యక్తిగత సెట్టింగ్స్‌తో మరెంతో అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. మరి ఇలాంటి స్మార్ట్ఫోన్‌ను తయారు చేస్తున్నది టెక్నాలజీలో దూసుకెళ్తున్న అమెరికానో, చైనానో కాదు. ఆ ఘనత ఇజ్రాయెల్‌ది. సొలారిన్‌ను తెస్తున్న సిరిన్ ల్యాబ్స్ ఇజ్రాయెల్‌కు చెందినది. 2013లో స్థాపించిన ఈ సంస్థకు.. లగ్జరీ ఫోన్ల తయారీలో పేరుంది. ఇటీవలే 72 మిలియన్ డాలర్ల నిధులను కూడా సేకరించింది ఈ స్టార్టప్. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ పరిచయానికి సిరిన్ ల్యాబ్స్ సిద్ధమవగా, తొలి సొలారిన్ స్మార్ట్ఫోన్ లండన్ రిటైల్ స్టోర్‌లో అందుబాటులో ఉండే వీలుంది. అయితే తొలుత తమ ఈ-కామర్స్ సైట్‌లోనే అమ్మకాలు మొదలవుతాయంటున్న సిరిన్ ల్యాబ్స్.. యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో అదనంగా మరిన్ని రిటైల్ స్టోర్లను తెరవాలనుకుంటోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ లోహాలను దీని తయారీకి వినియోగిస్తున్నట్లు కూడా సిరిన్ ల్యాబ్స్ చెబుతోంది. ఇదిలావుంటే లగ్జరీ స్మార్ట్ఫోన్లు ఇప్పుడే వస్తున్నవి కావు. అంతేగాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్‌గా చెబుతున్న సొలారిన్ కంటే ఎక్కువ ధర కలిగిన ఫోన్లూ ఉండటం గమనార్హం. 2006 లోనే నోకియా ‘సిగ్నేచర్ కోబ్రా’ పేరిట 3,10,000 డాలర్ల (రూ. 2 కోట్ల పైమాటే) స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. 2011లో 5,000 డాలర్లతో ‘కన్స్‌టెల్లేషన్’ అనే మరో స్మార్ట్ఫోన్‌నూ తెచ్చింది. 2012లో నోకియా లగ్జరీ బ్రాండైన వెర్టు.. ‘వెర్టు టి’ పేరుతో తొలి అండ్రాయిడ్ స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. భారత్‌లో దీని ధర 6,49,990 రూపాయలు. దీనిలో డ్యూయెల్-కోర్ 1.7 గిగాహెట్జ్ ప్రాసెసర్‌తోపాటు 1జిబి ర్యామ్, 64జిబి డేటా స్టోరేజ్ సామ ర్థ్యం ఉంది. 184 భాగాలుగా ఉన్న ఈ ఫోన్‌ను గ్రేడ్ 5 టైటానియంతో రూపొందించారు. బ్యాంగ్ అండ్ వ్వూఫ్సెన్ స్టీరియో స్పీకర్లను దీనికి వినియోగించారు. మరోవైపు స్విట్జర్లాండ్‌కు చెందిన గోల్డ్‌విష్ సంస్థ ‘లెమిల్లియన్ పీస్ యూనిక్’ పేరుతో ఏకంగా 13 లక్షల డాలర్ల (దాదాపు రూ. 9 కోట్లు) ధరతో ఓ స్మార్ట్ఫోన్‌ను ఇప్పటికే పరిచయం చేసింది. వజ్రాలు, ప్లాటినం, టైటానియంతో దీన్ని రూపొందించింది.

వెర్టు ‘సిగ్నేచర్ కోబ్రా’ ధర రూ. 2 కోట్లపైనే