బిజినెస్

‘సింక్రోనీ’కి సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఆర్ధిక కార్యకలాపాలు అందించేందుకు ఏర్పాటైన సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. గురువారం నాడిక్కడ ఒక హాటల్‌లో సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జయేష్ రంజన్ హాజరయ్యారు. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతంగా ఉందని ఆయన తెలిపారు. సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ప్రెసిడెంట్, సిఇఓ మార్గరెట్ కీన్ మాట్లాడుతూ ఫైనాన్సియల్ రంగంలో 2014 నుంచి 2017 మధ్య తమ సంస్థ ద్వారా దాదాపు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతున్నామని తెలిపారు. తద్వారా త్వరలో హైదరాబాద్‌లో మా ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను విస్తరించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సంపూర్ణ సహకారం అందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఫైనాన్సియల్ టెక్నాలజీకి సంబంధించి నూతన విధానాలు, సృజనాత్మకతను ఆవిష్కరించడంలో సుప్రసిద్ధమైనదిగా తమ సంస్థ గుర్తింపు పొందిందని అన్నారు.