బిజినెస్

మరిన్ని చర్యలు చేపట్టే యోచన లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలోకి చౌకగా వచ్చిపడుతున్న ఉక్కు దిగుమతులను నియంత్రించేందుకు వీలుగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు తమ శాఖ సుముఖంగా లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్కుపై తాము కనీస దిగుమతి ధర (ఎంఐపి)ను విధించామని, ఈ దిగుమతులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే విషయం గురించి తాను ఆలోచించడం లేదని ఆమె విలేఖర్లకు తెలిపారు. ప్రస్తుతం ఈ అంశాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, కనుక ఆ శాఖ ఏమి చెబుతుందనన్నదీ వేచి చూడాల్సిందేనని ఆమె అన్నారు. చౌకగా వచ్చిపడుతున్న ఉక్కు దిగుమతులను నిలువరించేందుకు మరిన్ని చర్యలు చేపట్టే విషయాన్ని వాణిజ్య శాఖ పరిశీలిస్తోందా? అని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ పైవిధంగా స్పందించారు. చౌకగా వస్తున్న దిగుమతుల నుంచి దేశీయ ఉక్కు ఉత్పత్తి దారులకు ఉపశమనాన్ని కలిగించేందుకు ఫిబ్రవరిలో ప్రభుత్వం 173 ఉక్కు ఉత్పత్తుల కనీస దిగుమతి ధరను టన్నుకు 341 డాలర్ల నుంచి 752 డాలర్లుగా నిర్ధేశించిన విషయం తెలిసిందే.