బిజినెస్

మార్కెట్లలో అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 11: ఈ ఏడాది రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గురువారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు ఆశావహ దృక్పథంతో ముగిశాయి. వరసగా రెండో రోజు గురువారం కూడా సెనె్సక్స్, నిఫ్టీ లాభాల్లో ముగిశాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 3 పాయింట్లు పెరిగి 30,250.98 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ సిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 9, 422.41 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ లావాదేవీలు మొదలైనప్పటినుంచి ఈ రెండు సూచీలు వివిధ దశల్లో ఊగిసలాడాయి. ముఖ్యంగా హీరో మోటోకార్ప్, జాజ్ ఆటో షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఒక దశలో సెనె్సక్స్ 30,336.43 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే లావాదేవీల చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో 30,250.98 వద్ద ముగిసింది. అంటే 2.81 పాయింట్ల స్వల్ప లాభాన్ని మాత్రమే ఆర్జించింది. అయినప్పటికీ ఇదికూడా సరికొత్త రికార్డు కావడం గమనార్హం. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా ఒక దశలో 9,450. 67 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరుకున్నా అంతిమంగా 9,422.40 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్నటిముగింపుకంటే ఇది 15.10 పాయింట్లు అధికం. నేటి లావాదేవీల్లో హీరో మోటోకార్ప్ 4.26 శాతం పెరిగింది. రెండోస్థానంలో ఉన్న బజాజ్ ఆటో 3.12 శాతం పుంజుకుంది. అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ, ఐటిసి, సన్‌ఫార్మా, విప్రో షేర్లు కూడా బాగానే లాభపడ్డాయి.
నష్టపోయిన వాటిలో భారతీ ఎయిర్‌టెల్, గెయిల్, ఒఎన్‌జిసి, హెచ్‌యుఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టిపిసి, కోల్ ఇండియా, టాటా మోటార్స్ మొదలైనవి ఉన్నాయి.