బిజినెస్

2016-17 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 7.8 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని, 2017-18లో అది మరింత వేగవంతమై 7.8 శాతానికి చేరుకోవచ్చని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది. నిలకడయిన ఉపాధి అవకాశాల కారణంగా దేశీయంగా వినయోగం పెరగడంతో పాటుగా ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం ప్రధానంగా దీనికి కారణమని ఆ నివేదిక పేర్కొంది. సమీప భవిష్యత్తులో వృద్ది అంచనా సానుకూలంగా ఉందని. 2006లో వృద్ధి రేటు 7.6 శాతం, 2017లో 7.8 శాతంగా ఉండవచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడింది. నిలకడైన ఉపాధి అవకాశాల వృద్ధి, దానికి తోడు ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం కారణంగా పట్టణ ప్రాంత కుటుంబాలు ఖర్చు చేయడం మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆ నివేదిక పేర్కొంది. రుణాలకోసం అయ్యే ఖర్చు తక్కువగా ఉండడం, అలాగే దేశంలో వ్యాపారం చేయడానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ మెరుగైన ర్యాంక్ ఇవ్వడం కారణంగా నిలకడైన పెట్టుబడుల వాతావరణం కనిపించడం కూడా దీనికి తోడవుతోందని ఆ నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉండగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా)ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత దేశ జిడిపి వృద్ధి అంచనాను ఇంతకు ముందు అంచనా వేసిన 7.9 శాతంనుంచి 7.7 శాతానికి కుదించింది. రుతుపవనాలు మామూలుస్థాయికి మించి ఉండవచ్చన్న వాతావరణ విభాగం అంచనాలు వ్యవసాయ రంగానికి అనుకూలమైనదే అయినప్పటికీ పారిశ్రామిక రంగం కోలుకోక పోవడం భారత అభివృద్ధి పుంజుకోవడానికి ప్రధాన అడ్డంకిగా ఉండే అవకాశముందని, నెలవారీ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో సైతం ఇది ప్రతిఫలిస్తోందని ఆ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది.