బిజినెస్

10 రోజుల్లోనే ప్రావిడెంట్ ఫండ్ క్లెయిముల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్) చందాదారులకు శుభవార్త. ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఉపసంహరణతో పాటు పెన్షన్, ఇన్సూరెన్స్ (బీమా) తదితర వివిధ క్లెయిముల పరిష్కారానికి ప్రస్తుతం 20 రోజులుగా ఉన్న గడువును 10 రోజులకు ఇపిఎఫ్‌ఓ కుదించింది. దేశంలోని నాలుగు కోట్ల మంది పిఎఫ్ చందాదారులకు సత్వర సేవలను అందించేందుకు 2015 జూలైలో ఈ క్లెయిముల పరిష్కార గడువును 20 రోజులకు తగ్గించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈ నెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో క్లెయిములను పరిష్కరించుకునే సదుపాయాన్ని ప్రారంభించిన విషయం విదితమే. మున్ముందు ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉన్న ఇపిఎఫ్ ఖాతాదారులు క్లెయిముల కోసం చేసుకునే దరఖాస్తులను కేవలం 3 గంటల వ్యవధిలోనే పరిష్కరించాలని ఇపిఎఫ్‌ఓ భావిస్తోంది.