బిజినెస్

యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డిఐకి లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి).. శుక్రవారం 13,030 కోట్ల రూపాయల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో మూడో అతిపెద్దదైన యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డిఐ విలువే 12,900 కోట్ల రూపాయలు. ఎఫ్‌ఐపిబి అంగీకారంతో యాక్సిస్ బ్యాంక్‌లో విదేశీ పెట్టుబడులకు ప్రస్తుతమున్న పరిమితి కాస్తా 62 శాతం నుంచి 74 శాతానికి చేరనుంది. కాగా, శుక్రవారం జరిగిన సమావేశంలో మొత్తం 14 ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను ఎఫ్‌ఐపిబి పరిశీలించగా, ఐదింటికి గ్రీన్‌సిగ్నల్ లభించింది.