బిజినెస్

రూ. 30 వేలకు బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బంగారం ధరలు మళ్లీ 30,000 రూపాయల మార్కును తాకాయి. వరుసగా గత మూడు రోజుల నుంచి పెరుగుతున్న ధరలు.. శుక్రవారం కూడా పరుగులు పెట్టాయి. దీంతో ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 30,250 రూపాయలకు చేరింది. శుక్రవారం 350 రూపాయలు ఎగిసింది. ఫలితంగా దాదాపు రెండేళ్లలో బులియన్ మార్కెట్‌లోనే అత్యధిక స్థాయికి బంగారం ధర చేరినట్లైంది. 2014 మే 13 తర్వాత ఈ స్థాయికి ధరలు చేరిన దాఖలాలు లేవు. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర సైతం 30,100 రూపాయల వద్ద నిలిచింది. కిలో వెండి ధర కూడా 600 రూపాయలు ఎగబాకి 41,600 రూపాయల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల సంకేతాలకుతోడు పెళ్ళిళ్ల సీజన్ దృష్ట్యా నగల వ్యాపారులు పసిడి కొనుగోళ్లకు ఆసక్తి కనబరచడం బంగారం ధరలను పరిగెత్తించాయి. అటు పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్ ఏర్పడటంతో వెండి ధరలూ ఎగిశాయి. ఇక భారతీయ మార్కెట్‌ను ప్రభావితం చేసే సింగపూర్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సు 1,274.24 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా ఔన్సు 17.84 డాలర్లను తాకింది. 2015 జనవరి నుంచి గమనిస్తే ఇదే అత్యధిక స్థాయి కావడం గమనార్హం.