బిజినెస్

గంగవరం పోర్టు రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 29: అన్‌లోడింగ్‌లో గంగవరం పోర్టు రికార్డు సృష్టించింది. 24 గంటల్లో నౌకలోగల 1,56,339 లక్షల మెట్రిక్ టన్నుల నాన్-కోకింగ్ కోల్ ను అన్‌లోడింగ్ చేసి ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం ఒక్క రోజులో ఈ స్థాయ అన్‌లో డింగ్ దేశంలోని ఏ పోర్టులోనూ జరగలేదని పోర్టు వర్గాలు పేర్కొన్నాయ. ప్రపంచంలోనూ పోర్టుల్లో కూడా నమోదు కాకపోవచ్చన్నారు. హిందాల్కో ఇండస్ట్రీస్‌కు తరలించేందుకు హాంకాంగ్ నుండి 1,59,966 మెట్రిక్ టన్నుల నాన్-కోకింగ్ కోల్‌తో ఎంవి కేఫ్ ఏసియన్ వెసల్స్ ఈనెల 27న గంగవరం పోర్టుకు చేరుకుంది. కాగా, మొత్తం ఈ కోల్‌ను 27 గంటల్లో అన్‌లోడింగ్ చేసినట్లు గంగవరం పోర్టు యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా గంగవరం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ దండు మాట్లాడుతూ అన్‌లోడింగ్ చేయడంలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గంగవరం పోర్టు యాజమాన్యం రికార్డు సృష్టించిందన్నారు. దేశంలోనే అత్యంత లోతైన గంగవరం పోర్టులో 2009లో అన్‌లోడింగ్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటివరకు అన్‌లోడింగ్‌లో గంగవరం పోర్టు యాజమాన్యం అనేక మైళురాళ్లు దాటిందని చెప్పుకొచ్చారు. ఈ విజయం వెనుక కార్మికులు, గంగవరం పోర్టు యాజమాన్యం శ్రమ ఎంతో ఉందన్నారు. అన్‌లోడింగ్‌లో రికార్డు సృష్టించడంపట్ల ఆయన కార్మికులు, గంగవరం పోర్టు యాజమాన్యాన్ని అభినందించారు. అందరి సహకారంతో భవిష్యత్‌లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు.