బిజినెస్

సహారాకు మరో 10 రోజుల గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌కి 709.82 కోట్ల రూపాయల డిపాజిట్ చేసేందుకు సుప్రీం కోర్టు మరో 10 రోజుల గడువు ఇచ్చింది. మొత్తం 1,500 కోట్ల రూపాయల డిపాజిట్‌కుగాను ఇప్పటికే 790.18 కోట్ల రూపాయల డిపాజిట్‌ను చేశామని సహారా గ్రూప్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పడంతో దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. మిగతా సొమ్ము డిపాజిట్‌కు మరో 10 రోజులు గడువిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సెబీ-సహారా కేసులో భాగంగా 2014 మార్చి 4 నుంచి సుబ్రతా రాయ్ తీహార్ జైళ్లో ఉంటున్నది తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయటకురాగా, జూలై 5 వరకు ఈ బెయిల్ గడువునూ ఈ సందర్భంగా సుప్రీం పొడిగించింది. సహారా గ్రూప్‌నకు చెందిన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి పెద్ద ఎత్తున నిధులను సమీకరించాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆక్షేపించింది. సహారాపై జరిమానాకు సిద్ధమవగా, చివరకు ఈ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ క్రమంలో రాయ్ జైలుపాలవగా, బెయిల్ కోసం 10,000 కోట్ల రూపాయల డిపాజిట్‌ను సుప్రీం కోరింది. మదుపరుల నుంచి సేకరించిన 24,000 కోట్ల రూపాయలను తిరిగి వెంటనే చెల్లించాలని కూడా ఆదేశించింది. అయితే అంత సొమ్ము లేకపోవడంతో సహారా గ్రూప్.. తమ ఆస్తుల అమ్మకానికి దిగాల్సి వస్తోంది.