బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సరికొత్త రికార్డులను నమోదుచేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 255.17 పాయింట్లు పుంజుకుని 31,311.57 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి 9,657.55 వద్ద నిలిచింది. జూలై 1 నుంచే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలవుతుందని, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరిన్ని సంస్కరణలను చేపడుతుందన్న విశ్వాసంతోనే మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినవారిలో పెద్ద ఎత్తున బకాయిపడ్డ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చర్యలకు ఉపక్రమించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. అలాగే ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు సైతం స్టాక్ మార్కెట్లను నూతన శిఖరాలకు చేర్చాయి. కాగా, సోమవారం ట్రేడింగ్‌లో మెటల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, పవర్, పిఎస్‌యు, ఆటో రంగాల షేర్లు 1.89 శాతం నుంచి 0.25 శాతం మేర లాభపడ్డాయి. మిడ్-క్యాప్ సూచీ 0.07 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ సూచీ 0.08 శాతం మేర తగ్గింది. ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన జపాన్, హాంకాంగ్, షాంగై, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలకమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభాల్లోనే కదలాడాయి.
భారీ నష్టాల్లో ల్యాంకో షేర్లు
న్యూఢిల్లీ: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో భారీ నష్టాలకు గురయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్ ఐడిబిఐ నుంచి ల్యాంకో పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, చెల్లించలేకపోవడంతో ఆ రుణాల వసూళ్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) చర్యలకు ఉపక్రమించడంతో సంస్థ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.
దివాళా చట్టం క్రింద చర్యలు తీసుకోవాలని ఐడిబిఐకి ఆర్‌బిఐ సూచించింది. దీంతో ల్యాంకో ఇన్‌ఫ్రా షేర్ విలువ ఈ ఒక్కరోజే అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇలో తీవ్రంగా నష్టపోయింది. బిఎస్‌ఇలో 20 శాతం క్షీణించి రూపాయి 88 పైసలకు దిగజారిన ల్యాంకో ఇన్‌ఫ్రా షేర్ విలువ.. ఎన్‌ఎస్‌ఇలో 19.14 శాతం పతనమై రూపాయి 90 పైసల వద్దకు చేరింది. మొండి బకాయిదారుల్లో ఆర్‌బిఐ గుర్తించిన మొదటి 12 సంస్థల్లో ల్యాంకో ఇన్‌ఫ్రా కూడా ఉంది. దీని స్థూల రుణాల విలువ దాదాపు 45,000 కోట్ల రూపాయలకుపైగా ఉంది. కాగా, ఆమ్‌టెక్ ఆటో, భూషణ్ స్టీల్, మొనె్నట్ ఇస్పాత్, అలోక్ ఇండస్ట్రీస్ సంస్థల షేర్లూ భారీగానే నష్టాలను చవిచూశాయి. ఆర్‌బిఐ గుర్తించిన 12 అతిపెద్ద మొండి బకాయిల్లో ఈ సంస్థలూ ఉన్నాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఆమ్‌టెక్ ఆటో షేర్ విలువ 19.97 శాతం, భూషణ్ స్టీల్ 16.16 శాతం, మొనె్నట్ ఇస్పాత్ 12.37 శాతం, అలోక్ ఇండస్ట్రీస్ 11.61 శాతం చొప్పున పడిపోయింది.