బిజినెస్

ఒఎన్‌జిసి తదుపరి సిఎండిగా శశి శంకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా శశి శంకర్ నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈయన బాధ్యతల్లోకి రానున్నారు. సెప్టెంబర్ 30న దినేశ్ కె సరఫ్ పదవీవిరమణ పొందుతుండటంతో ఆయన స్థానంలో శంకర్ వస్తారని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పిఇఎస్‌బి) తెలియజేసింది. శంకర్ ప్రస్తుతం ఒఎన్‌జిసి టెక్నికల్, ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఒఎన్‌జిసి సిఎండి పదవి కోసం తొమ్మిది మందిని పిఇఎస్‌బి ఇంటర్వ్యూ చేసింది. అందులో శంకర్‌ను ఎంపిక చేసింది.