బిజినెస్

హాత్‌వే ఐపిఓకు 41% సబ్‌స్క్రిప్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 22: కేబుల్ టీవీ, బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే జిటిపిఎల్ హాత్‌వే పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ)కు గురువారం రెండో రోజు ముగిసే సమయానికి 41 శాతం సబ్‌స్క్రిప్షన్ అందింది. మొత్తం ఇష్యూ సైజు 2,02,15,966 షేర్లు కాగా ఇప్పటివరకు 83,22,072 షేర్లకు బిడ్లు అందాయని ఎన్‌ఎస్‌ఇకి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు కేటాయించిన వాటిలో 69 శాతం, సంస్థాగతేతర ఇనె్వస్టర్లకు కేటాయించిన వాటిలో 15 శాతం, రిటైల్ ఇనె్వస్టర్లకు కేటాయించిన షేర్లలో 36 శాతానికి బిడ్లు అందాయి. ఈ నెల 21న ప్రారంభమయిన ఈ పబ్లిక్ ఇష్యూ శుక్రవారంతో ముగుస్తుంది. షేరు ఒక్కింటికి 167-170 రూపాయల ధరతో విక్రయించడం ద్వారా ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా దాదాపు 485 కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని కంపెనీ అనుకుంటోంది.