బిజినెస్

8 శాతం పెరగనున్న ఐటి ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో దేశ ఐటి ఎగుమతులు 7 నుంచి 8 శాతం పెరిగే అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. అలాగే దేశీయ ఐటి మార్కెట్ 10 నుంచి 11 వృద్ధి చెందుతుందని, ఐటి రంగంలో ఈ ఏడాది కొత్తగా 1.3 లక్షల నుంచి 1.5 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నామని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ గురువారం హైదరాబాద్‌లో విలేఖరులకు తెలిపారు. ఐటి రంగంలో గత ఏడాది మొత్తం 1.7 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కీలకమైన విదేశీ మార్కెట్లలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చత పరిస్థితులు గత ఏడాది ఐటి రంగ నిర్ణయాలతో పాటు పెట్టుబడులు, సంస్థల పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపాయాని, అయితే భవిష్యత్తులో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని నాస్కామ్ నిపుణులు భావిస్తున్నారని చంద్రశేఖర్ తెలిపారు. అంతర్జాతీయ ఐటి రంగంలో భారత్ వాటా స్థిరంగా పెరుగుతోందని, గత ఏడాది అదనంగా వచ్చిన 11 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని కలుపుకుని భారత ఐటి పరిశ్రమ పరిమాణం 154 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.