బిజినెస్

అది తప్పుడు అభిప్రాయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 22: భారత ఐటి సంస్థలు తమ వ్యాపారం కోసం హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయన్న అభిప్రాయం సరైంది కాదని ఇన్ఫోసిస్ సంస్థ సిఇఓ విశాల్ సిక్కా పేర్కొన్నారు. తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను చేర్చుకునేందుకు వీసా నిబంధనలను దుర్వినియోగం చేస్తున్న సంస్థలపై అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేగవంతంగా మారుతున్న పరిస్థితులను తట్టుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీల ద్వారా లభిస్తున్న అవకాశాలను పెద్ద మొత్తంలో అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయడ్డారు. ‘్భరత ఐటి సంస్థలు తమ వ్యాపార అభివృద్ధి కోసం హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయని అనుకోవడం సరికాదు. ఈ అభిప్రాయంలో ఏమాత్రం నిజం లేదు. ఉదాహరణకు గత పది సంవత్సరాల కాలంలో అమెరికా ఏటా దాదాపు 65 వేల మందికి మాత్రమే హెచ్-1బి వీసాలు మంజూరు చేసింది. దీని ప్రకారం గత పదేళ్లలో 6.5 లక్షల మందికి మాత్రమే హెచ్-1బి వీసాలు లభించాయి. కానీ ఈ పదేళ్లలో మేము (్భరత ఐటి సంస్థలు) సమష్టిగా లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాం. ఒక్క ఇన్ఫోసిస్ సంస్థలోనే 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇక టిసిఎస్ ఉద్యోగుల సంఖ్య దీనికి దాదాపు రెట్టింపు ఉంటుంది. కనుక భారత ఐటి సంస్థలు హెచ్-1బి వీసాలపై అధికంగా ఆధారపడుతున్నాయని భావించడం సరికాదు’ అని వాషింగ్టన్‌లో పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ సిక్కా పేర్కొన్నారు.