బిజినెస్

జిఎస్టీ నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జిఎస్టీ) అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వస్తు, సేవల పన్ను (ఎపి జిఎస్టీ) చట్టం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో జిఎస్టీ అమలుకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి నాలుగు జీవోలను ప్రభుత్వం జారీ చేసింది. కొందరు వ్యాపారులకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు, ఈ చట్టానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పోర్టల్ వివరాలు, చట్టంలోని కొన్ని సెక్షన్లకు అప్పాయింటింగ్ డేను నిర్ణయిస్తూ జీవోలు జారీ అయ్యాయి.
ఎంఎస్‌ఎంఇ అభివృద్ధి
కార్పొరేషన్ ఏర్పాటు
రెండంకెల వృద్ధిరేటు సాధించేందుకు, ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో ఎంఎస్‌ఎంఇ యూనిట్లు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ పెట్టుబడులతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేందుకు ఈ యూనిట్లు ఉపకరిస్తాయనేది ప్రభుత్వ యోచన. ఎంఎస్‌ఎంఇ యూనిట్ల ఏర్పాటును ప్రొత్సహించేందుకు వీలుగా ఎపి ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాత్కాలిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్
నిర్మాణానికి నిధుల కేటాయింపు
విజయవాడలో తాత్కాలిక ప్రాతిపదికన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను నిర్మించేందుకు వీలుగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. 27కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ప్రతిపాదించగా, అందులో 13కోట్ల రూపాయలకు అనుమతి మంజూరు చేసింది. డిఎన్‌ఎ సీక్వెన్సింగ్ ల్యాబ్, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ఆడియో-వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్, బ్యాలిస్టిక్స్, ఫైల్ ఆర్మ్స్ ల్యాబ్, డాక్యుమెంట్స్ అనాలిసిస్ ల్యాబ్, డ్రగ్స్, నార్కొటిక్స్ ల్యాబ్, ఎక్స్‌ప్లోజివ్స్, కెమికల్ టెస్టింగ్ ల్యాబ్, సెరాలజీ, బయాలజీ, బయోమెడికల్ ల్యాబ్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ ల్యాబ్, పాలిగ్రాఫ్, బిహేవియరల్ సైకాలజీ ల్యాబ్, ఆటోమేటిక్ ఫింగర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేషన్ సిస్టిమ్, ఐదు ఫోరెన్సిల్ ల్యాబ్‌ల ఆధునీకరణ పనులను 27 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు.
వేస్ట్ ఆయిల్ సేకరణపై యూజర్ చార్జీలు
కాకినాడ పోర్టుకు వచ్చే వివిధ నౌకల నుంచి వేస్ట్ ఆయిల్‌ను తీరానికి టగ్స్, డ్రమ్‌బార్జిల ద్వారా కొందరు తరలిస్తున్నారు. స్థానిక ఓడరేవు అధికారుల అనుమతితో ఈ తరలింపు జరుగుతోంది. అయితే ఈ తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చేందుకు, ఇంటర్నేషనల్ మార్‌పోల్ నిబంధనల మేరకు ఇకపై యూజర్ చార్జీలను వసూలు చేయాలని రాష్ట్ర ఓడరేవుల విభాగం నిర్ణయించింది. కాకినాడ రేవుకు వచ్చే ఓడల నుంచి తరలిస్తున్న వేస్ట్ ఆయిల్‌పై ఇకపై లీటరుకు రూపాయి సర్వీస్ చార్జి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.