బిజినెస్

ఎస్సార్-రాస్‌నెఫ్ట్ డీల్‌కు బ్యాంకర్ల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: రష్యా ప్రభుత్వరంగ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు తమ గుజరాత్ రిఫైనరీని అమ్మేయడానికి ఉన్న అడ్డంకులను ఎస్సార్ గ్రూప్ ఎట్టకేలకు అధిగమించగలిగింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 23 బ్యాంకుల కూటమి.. శుక్రవారం 86,000 కోట్ల రూపాయల విలువైన ఎస్సార్ ఆయిల్-రాస్‌నెఫ్ట్ డీల్‌కు అనుమతిచ్చింది. ఎస్సార్ గ్రూప్ అధినేతలైన రుయాలు ఎల్‌ఐసిసహా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకర్లకు బకాయిపడ్డ 26,000 కోట్ల రూపాయలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 10లోగా ఈ డీల్ ముగుస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఎస్సార్ ఆయిల్ వర్గాలు వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం.