బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 152.53 పాయింట్లు క్షీణించి 31,138.21 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 55.05 పాయింట్లు పడిపోయి 9,574.95 వద్ద నిలిచింది.
ఉదయం ఆరంభంలో లాభాల్లో కదలాడినప్పటికీ.. చివరకు నష్టాల్లోనే ముగిశాయి. మరోవైపు ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 81.81 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ 13.10 పాయింట్లు తగ్గింది.
సెనె్సక్స్ టాప్-10 సంస్థల్లో ఆర్‌ఐఎల్‌కు అగ్రస్థానం
ఇదిలావుంటే సెనె్సక్స్ టాప్-10 సంస్థల మార్కెట్ విలువలో దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధిగమించింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిశాక ఆర్‌ఐఎల్ మదుపరుల సంపద 4,66,599.69 కోట్ల రూపాయల వద్దకు చేరగా, రెండు నెలల తర్వాత మళ్లీ ప్రథమ స్థానంలో నిలిచింది. టిసిఎస్ కంటే ఇది 1,450.62 కోట్ల రూపాయలు అధికం. టిసిఎస్ మదుపరుల సంపద విలువ 4,65,149.07 కోట్ల రూపాయలుగా ఉంది. ఆర్‌ఐఎల్ షేర్ విలువ 0.13 శాతం పెరిగి 1,435 రూపాయలుగా ఉంటే, టిసిఎస్ షేర్ విలువ 1.47 శాతం పతనమై 2,360.65 వద్ద ముగిసింది.
సోమవారం మార్కెట్లకు సెలవు
ఇకపోతే సోమవారం మార్కెట్లకు సెలవు. రంజాన్ సందర్భంగా అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇ మూతపడనున్నా యి. ఈ మేరకు శుక్రవారం ఇరు స్టాక్ ఎక్స్‌చేంజ్ వర్గాలు హాలీడే నోటీసు ఇచ్చాయి. తిరిగి మంగళవారం యథాతథంగా ట్రేడింగ్ కొనసాగుతుందని ప్రకటించాయి.