బిజినెస్

చిలప నూలుపై ఐదు శాతం జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: ఇప్పటికే తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత రంగానికి మరో ఎదురుదెబ్బ తగలబోతున్నది. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల కాటన్ చిలప నూలుపై ఐదు శాతం పన్ను పడనుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ చేనేత రంగంపై సాలీనా దాదాపు పది కోట్ల రూపాయల భారం పడనుంది. దీనిపై ఇప్పటికే వస్త్ర వ్యాపారులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు.
చేనేత రంగంపై ఈ పన్ను విధింపు వల్ల చేనేత వస్త్రాల ధరలు కూడా పెరగనున్నాయి. మార్కెట్‌లో ఇప్పటికే మిల్లు వస్త్రాల ధరలు చేనేత వస్త్రాల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పన్ను వల్ల ధరల్లో వ్యత్యాసం మరింత పెరిగి చేనేత వస్త్రాలకు గిరాకీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇందువల్ల సహకార సంఘాల్లోని సభ్యులు, సహకారేతర సభ్యులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే వీలుంది. దీంతో సంప్రదాయ చేనేత రంగం దెబ్బతినే ప్రమాదం ఉన్నందున జిఎస్‌టి నుండి చేనేత రంగాన్ని మినహాయించాలని కొన్ని చేనేత కార్మిక సమాఖ్యలు, సంస్థలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ను కోరారు. తదనుగుణంగా 5 శాతం జిఎస్‌టి నుండి సంప్రదాయ చేనేత రంగాన్ని మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెవిన్యూ (వాణిజ్య పన్నుల శాఖ) కమిషనర్, చేనేత జౌళి శాఖ నుండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. దీనిపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.