బిజినెస్
‘స్కార్పియో’ ఆటోమ్యాటిక్ ఇక కనుమరుగు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 26 June 2017
న్యూఢిల్లీ, జూన్ 25: దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎంతో ప్రజాదరణ పొందిన తమ ‘స్కార్పియో’ ఎస్‌యువి ఆటోమ్యాటిక్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసింది. ముంబయిని కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే స్కార్పియో-ఎటి వేరియంట్‌ను తమ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఈ విషయమై వివరణ కోరేందుకు ఆ సంస్థ ప్రతినిధిని సంప్రదించగా, స్కార్పియో ఆటోమ్యాటిక్ వేరియంట్ అమ్మకాలను నిలిపివేసిన మాట నిజమేనని ధ్రువీకరించారు.