బిజినెస్

స్టాక్స్ పెట్టుబడుల్లో ఎఫ్‌పిఐలను మించిపోయన మ్యూచువల్ ఫండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ర్యాలీని సానుకూలంగా మలుచుకోవడం కోసం దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్-మే నెలల మధ్య కాలంలో స్టాక్ మార్కెట్లలో 20 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టాయి. మరోవైపు విదేశీ ఇనె్వస్టర్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే చాలా తక్కువేనని చెప్పారు. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం పని తీరు పట్ల సైతం మ్యూచువల్ ఫండ్ సంస్థలు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి కూడా. మ్యూచువల్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న సంస్థలు ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లలో రూ. 11,244 కోట్లు పెట్టుబడి పెట్టగా మే నెలలో 9,358 కోట్లు పెట్టుబడి పెట్టాయి. అంటే ఈ రెండు నెలల్లో కలిపి మొత్తం 20,602 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయింది. సెబీ విడుదల చేసిన గణాంకాలను బట్టి ఈ వివరాలు తెలిశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ రూ 51,000 కోట్లకు పైగా దేశీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు(ఎఫ్‌పిఐ)లు ఇదే సమయంలో కేవలం 10 వేల కోట్ల విలువైన ఈక్విటీలను మాత్రమే కొనుగోలు చేశాయి. వృద్ధి విషయంలో మ్యూచువల్ ఫండ్స్ టేకాఫ్ దశలో ఉన్నాయని, భారతీయ మదుపరులు సైతం ఈక్విటీలను పెట్టుబడుల వర్గంగా భావిస్తూ వస్తున్నారని, అందుకే దేశీయ స్టాక్ మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.