బిజినెస్

సరుకుల ధరలు పెరగవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 25: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభయమిచ్చారు. జిఎస్‌టి పరిధిలోకి వచ్చిన వస్తువులపై ప్రభుత్వం కొత్త పన్ను రేట్లేమీ విధించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ‘జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలేమీ పెరగవు. అన్నీ ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉంటాయి. కనుక ఈ విషయమై అటు ప్రజలకు గానీ ఇటు వర్తకులకు గానీ ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు’ అని ఆమె పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుపై ఆదివారం చెన్నైలో నిర్వహించిన సమావేశం సందర్భంగా నిర్మలా సీతారామన్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వస్తు, సేవల పన్ను స్వరూపం గురించి ఆమె వివరణ ఇస్తూ, జిఎస్‌టిలో ఖరారు చేసిన రేటు తటస్థ రెవెన్యూ రేటుగా ఉంటుందని చెప్పారు.

చిత్రం.. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్