బిజినెస్

జిఎస్‌టితో తెలంగాణకు నష్టం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25:జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆదాయంలో ఎలాంటి లోటు ఉండదని, గతంలో ఏ విధంగా ఆదాయం ఉందో అలానే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 30 నుంచి జిఎస్‌టి అమలులోకి వసుండగా, జిఎస్‌టి ప్రభావంపై అధికారులు అంచనాలు వేస్తున్నారు. తెలంగాణ ప్రధానంగా వినియోగ దారుల రాష్ట్రం కావడం వల్ల జిఎస్‌టితో ప్రయోజనమే తప్ప ఆదాయం కోల్పోయే అవకాశం లేదని అంచనా వేస్తున్నట్టు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఒక రాష్ట్రంలో కార్లు తయారు చేస్తే కార్ల తయారీపై విధించే పన్ను ఆ రాష్ట్రానికే చెందుతుంది. కార్లు వినియోగించేంది ఇతర రాష్ట్రాలు. అయితే ఇప్పుడు ఎక్కడ వినియోగిస్తారో అక్కడ పన్ను వసూలు విధానం వల్ల కార్ల ఉత్పత్తి కన్నా వినియోగమే ఉన్న తెలంగాణకు ఇది ప్రయోజనకరం అని అంచనా వేస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంకుకు దేశ వ్యాప్తంగా బ్రాంచులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ముంభై ప్రధాన కార్యాలయంగా చూపుతూ సేవల పన్ను మాత్రం అక్కడే చెల్లించేది. జిఎస్‌టి విధానం వల్ల ఏ రాష్ట్రంలో సేవలు అందిస్తే అక్కడే పన్నులు చెల్లించాలి. ఉత్పత్తి ప్రధానమైన రాష్ట్రాలకు జిఎస్‌టి వల్ల కొంత ఆదాయం తగ్గవచ్చు కానీ వినియోగ ప్రధానమైన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఆదాయ నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు. జిఎస్‌టి అమలులోకి వచ్చిన తరువాత రెండు నెలలు కొంత అయోమయ పరిస్థితి ఉండవచ్చు,కానీ ఆ తరువాత అంతా సర్దుకుంటుందని, జిఎస్‌టి పన్నుల విధానంలో దేశంలో ఒక విప్లవాత్మక నిర్ణయం అని అధికారులు చెబుతున్నారు. పన్నుల విధానం ప్రాక్టికల్‌గా ఉండాలి అనేది తెలంగాణ అభిప్రాయం అని జిఎస్‌టి సమావేశాల్లో మొదటి నుంచి ఇదే మాట చెబుతున్నట్టు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చాలా వస్తువులకు జిఎస్‌టిలో పన్ను ప్రాక్టికల్‌గా లేదని అన్నారు. ఈనెల 30న ఢిల్లీలో జిఎస్‌టిపై సమావేశం ఉందని, ఈ సమావేశంలో తెలంగాణ అభిప్రాయాన్ని స్పష్టం చేయనున్నట్టు తెలిపారు. చేనేత వస్తువులపై పన్ను వేయవద్దని కేంద్రాన్ని ఇప్పటికే కోరాం, 30న సమావేశంలో మరింత గట్టిగా కోరుతాం అని ఈటల తెలిపారు.
జిఎస్‌టి అమలు కన్నా ముందు రాష్ట్ర ఆదాయం ఎంత ఉండేదో ఆ ఆదాయం ఏ మాత్రం తగ్గకుండా కేంద్రం హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం 14శాతం ఆదాయ వృద్ధి ఉండేట్టు చూస్తారు. ఆ మేరకు ఏ రాష్ట్రానికైనా ఆదాయం రాకపోతే కేంద్రం ఆ మేరకు పరిహారం చెల్లిస్తుంది. అయితే తెలంగాణ కాంపన్‌షేషన్ పొందే స్థితిలో ఉండదని, ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. దేశంలో సగటు కన్నా తెలంగాణలో పట్టణాలు, నగరాల్లో నివసించే జనాభా ఎక్కువగా ఉందని, వినియోగ దారుల సంఖ్య ఎక్కువ కావడం వల్ల తెలంగాణకు ఆదాయం పెరగడమే కానీ తగ్గడం ఉండదని అధికారులు అంచనా వేశారు.