బిజినెస్

27 నుంచి బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తున్నట్లు తెలంగాణ వస్త్ర వ్యాపారుల సమాఖ్య ప్రకటించింది. వ్యవసాయ రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వస్త్ర పరిశ్రమపై జిఎస్‌టి విధింపు పెను భారమవుతుందని సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. మూడు రోజుల బంద్ అనంతరం 30వ తేదీన నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం నాడిక్కడ రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్, ట్రెజరర్ భద్రీశ్వరప్ప, సికింద్రాబాద్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్, హైదరాబాద్ హోల్‌సేల్, కట్‌పీసెస్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధి పురుషోత్తమ్ తదితరులు మాట్లాడుతూ ముక్తకంఠంతో వస్తప్రరిశ్రమపై జిఎస్‌టి విధింపును నిరసించాలని పిలుపు నిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వస్త్ర పరిశ్రమ ఎప్పుడూ మినహాయింపు వస్తువుల పరిధిలోకి వస్తుందని, పన్ను ప్రభావం పడ లేదని వారు తెలిపారు. ఇప్పుడు జిఎస్‌టి పరిధిలోకి కూడా రాదని, అయినప్పటికీ వస్తప్రరిశ్రమను ఎందుకు కేంద్రం జిఎస్‌టిలోకి తీసుకు రావాల్సి వచ్చిందో వెల్లడించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమలో పని చేసే 80 శాతం మంది అసంఘటిత రంగ కార్మికులేనని, వారిలో మహిళలు అధిక సంఖ్యలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నారని అన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ తొలుత రాష్ట్ర స్థాయిలో వ్యాట్, కేంద్ర స్థాయిలో సెంట్రల్ ఎక్సైజ్ విధించే ఉత్పాదనలకు జిఎస్‌టి విధింపు నుంచి మినహాయింపు ప్రకటించిందని తెలిపారు. ఆ తర్వాత పది ప్రధాన వస్త్ర తయారీ దారులు జరిపిన లాబీయింగ్ వల్ల కేంద్రం ఆఖరి నిమిషంలో తన వైఖరి మార్చుకుని జిఎస్‌టిని వస్తప్రరిశ్రమపైనా విధించిందని వారు తెలిపారు. ఈ నిర్ణయం వస్త్ర పరిశ్రమకు తీరని నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమలో ప్రధానంగా చాలా మంది ముందు ఉత్పాదనలను దుకాణాలకు ఇచ్చి, వాటిని అమ్మిన తర్వాత కొన్ని నెలలకు సొమ్ము తీసుకుంటారని తెలిపారు. అటువంటి చిన్న వ్యాపారులు జిఎస్‌టి నిర్ణయంతో తీవ్రంగా దెబ్బతింటారని అన్నారు. అసలే అంతంత మాత్రం లాభంతో వస్త్ర వ్యాపారాన్ని తీవ్ర పోటీ మధ్య నిర్వహిస్తుంటే జిఎస్‌టి విధింపుతో మరింత నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.