బిజినెస్

ఆర్థిక సంబంధాలను బలపరుద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 27: భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం బలోపేతానికి ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అటు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో తొలిసారి మోదీ సమావేశమవగా, అనంతరం ఆ వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్ విలేఖరులకు తెలియజేశారు. పౌర విమానయాన మార్కెట్, సహజ వాయువు రంగాల్లో సహకారంపై మోదీ, ట్రంప్ దృష్టిపెట్టారన్న ఆయన వచ్చే ఏడాది నుంచి భారత్‌కు అమెరికా ద్వారా ద్రవరూప సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) రానున్నట్లు చెప్పారు. మున్ముందు భారత్-అమెరికా ఎల్‌ఎన్‌జి వాణిజ్యం 40 బిలియన్ డాలర్లను దాటగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సందర్భంగా విలేఖరులు కీలకమైన హెచ్-1బి వీసా అంశం ప్రస్తావన తీసుకురాగానే జయశంకర్ స్పందిస్తూ డిజిటల్ భాగస్వామ్యం, ఇన్నోవేషన్ సహకారంపై చర్చ జరిగిందన్నారు. నేరుగా ఈ అంశంపై సమాధానం మాత్రం చెప్పకపోవడం గమనార్హం. అమెరికన్లకు ఉద్యోగవకాశాలు కల్పిస్తానన్న ప్రధాన నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చినది తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ ఐటి రంగ సంస్థలు అమెరికా నుంచి ఆదాయం పొందుతున్నాయని, స్థానికుల ఉద్యోగవకాశాలనూ కొల్లగొడుతున్నాయన్న దురభిప్రాయానికి వచ్చిన ట్రంప్.. హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేశారు. అమెరికాలో ఐటి ప్రాజెక్టులు చేపట్టేందుకు కావాల్సిన ఉద్యోగులను అక్కడికి పంపించాలంటే భారత్‌సహా అన్ని ఇతర దేశాలకు హెచ్-1బి వీసాలే అవసరం. అలాంటి వీసాలు దక్కడం ఇక అంత సులువు కాకపోవడంతో భారత్‌సహా అన్ని దేశాల ఐటి సంస్థలు అమెరికా ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు అక్కడివారినే నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నిపుణులను మాత్రమే అక్కడకు పంపుతుండగా, స్వదేశంలో ఎక్కువైపోయిన ఉద్యోగులను భారతీయ సంస్థలు తొలగించడం మొదలుపెట్టాయి. దీంతో దేశీయ ఐటి రంగంలో సంక్షోభం ఏర్పడగా, ట్రంప్‌తో భేటీలో ఈ వ్యవహారంపై చర్చించాలని భారతీయ ఐటి రంగ సంస్థలు మోదీకి సూచించాయి. కానీ అలాంటి చర్చేమీ ప్రభావవంతంగా జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. ఇది భారతీయ ఐటి రంగాన్ని కలవరపెడుతోంది. అయినప్పటికీ వీరిరువురి భేటీపై భారతీయ పారిశ్రామిక రంగం మాత్రం ఆశాభావంతోనే కనిపిస్తోంది. అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మార్కెట్ యాక్సెస్ విషయంలో వచ్చిన ఫలితాలను స్వాగతించారు. ఇదిలావుంటే భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ నిరుడు 114 బిలియన్ డాలర్లకు చేరింది.
డచ్ పౌరులకు వ్యాపార వీసాలు
మరోవైపు డచ్ పాస్‌పోర్టు కలిగిన పౌరులకు 5 సంవత్సరాలపాటు వ్యాపార, టూరిస్ట్ వీసా ఇవ్వాలన్న అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. అమెరికా నుంచి వచ్చిన మోదీ.. నెదర్లాండ్స్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడా రు. భారతదేశ ఆధునికీకరణ, అభివృద్ధికి సంబంధించి తాము తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడిన మోదీ.. భారత వైవిధ్యం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. బ్యాంకింగ్, ఇంధనం, డిజిటల్ రంగాల్లో తమ ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే రోదసి, హెల్త్‌కేర్, పారిశుద్ధ్య రంగాల్లోనూ సాధించిన ప్రగతిని తెలిపారు. పాడి పరిశ్రమ, వ్యవసాయం, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో మహిళలు అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు.

చిత్రం.. వైట్‌హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు