బిజినెస్

అన్ని విధాలా సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన శ్రీలంక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మరోవైపు శ్రీలంకలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
త్వరలో ఈ ప్రతినిధి బృందాన్ని శ్రీలంకకు పంపించి అక్కడ ఏఏ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయో అధ్యయనం చేయిస్తామని ముఖ్యమంత్రి శ్రీలంక ప్రతినిధుల బృందానికి చెప్పారు. సదరన్ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ షిరంతా హెరత్ నాయకత్వంలోని శ్రీలంక ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. శ్రీలంక లా అండ్ ఆర్డర్, సదరన్ డెవలప్‌మెంట్ మంత్రిత్వశాఖ క్రింద ఈ సదరన్ డెవలప్‌మెంట్ బోర్డ్ పని చేస్తోంది.
ఫార్మా, హార్టీకల్చర్, టూరిజం రంగాలలో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ బృందానికి చెప్పారు. కాగా, శ్రీలంకలో ఎపి పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు 600 ఎకరాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రికి బోర్డ్ చైర్మన్ హెరత్ వివరించారు. అన్నింటికి అనువైన 600 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. ఈ ప్రదేశంలో ఫార్మా, హార్టీకల్చర్, టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. శ్రీలంక, భారత్ మధ్య సౌహార్థ సంబంధాలు ఉన్నాయని చెబుతూ.. తాను ఆ దేశాన్ని సందర్శించినప్పుడు ఉభయ ప్రాంతాల అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకుందామని ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎపిలో రెండవతరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సిద్ధం చేస్తున్నామని, ఏ రంగంలోనైనా తమదైన ముద్రవేసి అనితర సాధ్యమైన విజయాలను సొంతం చేసుకునే సత్తా వారిలో ఉన్నదని అన్నారు. శ్రీలంక ప్రధానంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోందని, రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ సైతం పర్యాటక రంగంపై ఆశలతో ఉందని చెప్పారు.
రెండు ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పరస్పరం సహకరించుకోవడం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఫార్మా, ఇన్‌ఫ్రా, హార్టీకల్చర్ రంగాలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్టు చెప్పారు. విశాఖ కేంద్రంగా పని చేస్తున్న శ్రీలంక దేశపు అపెరల్ యూనిట్ ‘బ్రాండిక్స్’లో 18 వేల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించడం సంతోషకరమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఇలాంటి యూనిట్లు మరికొన్ని నెలకొల్పాలని ఆ దేశపు పెట్టుబడిదారులకు సూచించారు. ముఖ్యమంత్రిని కలిసిన శ్రీలంక బృందంలో బ్రాండిక్స్ ప్రతినిధి దొరైస్వామి తదితరులు ఉన్నారు.

చిత్రం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైన శ్రీలంక ప్రతినిధి బృందం