బిజినెస్

సెబీకి ఎస్‌బిఐ లైఫ్ ఐపిఒ పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధ బీమారంగ సంస్థ అయిన ఎస్‌బిఐ లైఫ్.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) పత్రాలను సమర్పించింది. దాదాపు 6,000-7,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఐపిఒకు ఎస్‌బిఐ లైఫ్ వస్తోంది. ఈ క్రమంలో ఎస్‌బిఐ లైఫ్ ప్రమోటర్లుగా ఉన్న ఎస్‌బిఐతోపాటు ఫ్రాన్స్‌కు చెందిన బిఎన్‌పి పరిబాస్ కార్డ్ఫి (బిఎన్‌పిపిసి).. సంస్థలో 12 శాతం వాటాను అమ్మకానికి పెడుతున్నాయి. ఎస్‌బిఐ 8 శాతం, బిఎన్‌పి పరిబాస్ కార్డ్ఫి 4 శాతం చొప్పున వాటాను విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌బిఐ లైఫ్‌లో ఎస్‌బిఐకి 70.10 శాతం, బిఎన్‌పి పరిబాస్ కార్డ్ఫికు 26 శాతం వాటా ఉన్నాయి. మిగతాది పలు మైనారిటీ భాగస్వాములకుంది.