బిజినెస్

త్వరలో పిడబ్ల్యుసికి వ్యతిరేకంగా సెబీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: భారతీయ ఐటి రంగాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ కుంభకోణంలో గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ (పిడబ్ల్యుసి)కు వ్యతిరేకంగా త్వరలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆదేశాలు ఇవ్వనుంది. ఈ కేసును సెబీ దర్యాప్తు చేస్తున్నది తెలిసిందే. కాగా, 2000-2008 మధ్య సత్యం కంప్యూటర్స్ కోసం పిడబ్ల్యుసి పనిచేసింది. అయితే సంస్థ ఆదాయ, వ్యయాల్లో తప్పుడు లెక్కలు చూపించినట్లు దాని వ్యవస్థాపకుడు బి రామలింగ రాజు స్వయంగా అంగీకరించడంతో ఇందులో పిడబ్ల్యుసి పాత్రపై సెబీ విచారణ చేపట్టింది.