బిజినెస్

దూసుకుపోతున్న లగ్జరీ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో లగ్జరీ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని, పెద్ద నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తితో పాటు బ్రాండెడ్ వస్తువుల పట్ల యువతలో అవగాహన పెరగడంతో ఈ ఏడాది లగ్జరీ మార్కెట్ దాదాపు 20 శాతం వృద్ధిచెంది 18.3 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక విభాగం అసోచామ్ తన అధ్యయనం ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం భారత లగ్జరీ మార్కెట్ విలువ 14.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. అయితే పెద్ద నగరాలతో పాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో ప్రజల కొనుగోలు శక్తి, అలాగే బ్రాండెడ్ వస్తువుల పట్ల యువతలో చైతన్యం గణనీయంగా పెరగడం దేశంలో లగ్జరీ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తాయని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్.రావత్ పేర్కొన్నారు. ఫైవ్‌స్టార్ హోటళ్లు, ఫైన్-డైనింగ్ రెస్టారెంట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లగ్జరీ పర్సనల్‌కేర్ వస్తువులు, ఆభరణ రంగాలు 2015లో చక్కటి ఫలితాలు సాధించాయని, రానున్న మూడేళ్లలో ఈ రంగాలు మరో 30 నుంచి 35 శాతం మేరకు వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. లగ్జరీ కార్లు, ముఖ్యంగా ఎస్‌యువిల (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్) కొనుగోళ్లకు చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని, నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లో రానున్న మూడేళ్లు ఇదే ధోరణి కొనసాగి ఈ రంగం 18 నుంచి 20 శాతం మేరకు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు అసోచామ్ పేర్కొంది.

ఐఐబిల కొనుగోలుకు
అంగీకరించలేదు
ఆర్‌బిఐ స్పష్టీకరణ
ముంబయి, జనవరి 14: ఏడేళ్ల తర్వాత పరిపక్వత పొందే ఐఐబిల (ద్రవ్యోల్బణ సూచీ బాండ్ల)ను తిరిగి కొనుగోలు చేయాలన్న ఎటువంటి ఆఫర్‌ను అంగీకరించలేదని రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గురువారం స్పష్టం చేసింది. అంతగా విజయవంతంకాని, 2023లో పరిపక్వత పొందే ఐఐబిలను గురువారం జరిగే రివర్స్ ఆక్షన్‌లో వాటి ముఖ విలువకు (సుమారు రూ.6,500 కోట్లకు) ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేస్తుందని రిజర్వు బ్యాంకు గత వారం పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణ సూచీ జిఎస్-2023లోని 1.44 శాతం బాండ్లను తిరిగి కొనుగోలు చేసేందుకు గురువారం వేలాన్ని నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించిన బిడ్లను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎటువంటి ఆఫర్‌ను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు రిజర్వు బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

డిసెంబర్‌లో 25 శాతం
పెరిగిన జాబ్ మార్కెట్
న్యూఢిల్లీ, జనవరి 14: దేశంలో ఉద్యోగుల నియామకాలు గత నెలలో దాదాపు 25 శాతం పెరిగాయి. 2015 సంవత్సరంలో మొత్తం మీద ఉద్యోగుల నియామకాలు మందకొడిగా ఉన్నప్పటికీ బ్యాంకింగ్, ఐటి, టెలికామ్, ఎఫ్‌ఎంసిజి రంగాల్లో గణనీయంగా పెరిగిన నియామకాలు ఈ వృద్ధికి దోహదం చేశాయని తాజాగా విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. 2014 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో ఉద్యోగ నియామకాల సూచీ దాదాపు 25 శాతం వృద్ధితో 1,783 పాయింట్లకు చేరుకుందని ‘నౌకరీ.కామ్’ నివేదిక వెల్లడించింది. ‘దేశంలో గత కొన్ని త్రైమాసికాల నుంచి పుంజుకుంటున్న జాబ్ మార్కెట్ స్థిరంగా ముందుకు కొనసాగుతూ 2014తో పోలిస్తే 2015 డిసెంబర్‌లో 25 శాతం వృద్ధిని సాధించిందని, ప్రధానంగా ఐటి, బ్యాంకింగ్, టెలికామ్, అడ్వర్టైజింగ్, మీడియా రంగాల్లో నియామకాలు పెరగడం ఇందుకు ఎంతగానో దోహదపడిందని, ఐటి యేతర రంగాల్లో కూడా నియామకాలు క్రమేణా పుంజుకుంటుండటంతో ఈ ఏడాది అంతటా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉందని ‘నౌకరీ.కామ్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేష్ పేర్కొన్నారు. ఢిల్లీ/ఎన్‌సిఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం), ముంబయిల్లో ఉద్యోగుల నియామకాలు గత నెల 34 శాతం పెరగ్గా, 28 శాతం వృద్ధితో బెంగళూరు, 17 శాతం వృద్ధితో హైదరాబాద్, 15 శాతం వృద్ధితో పుణే, 5 శాతం వృద్ధితో కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని ‘నౌకరీ.కామ్’ నివేదిక వెల్లడించింది.

రూ. 6 వేల కోట్ల ఎఫ్‌డిఐలకు కేంద్రం ఓకె
న్యూఢిల్లీ, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం గురువారం రూ. 6,050 కోట్ల విలువైన అయిదు విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీనిలో కాడిలా హెల్త్‌కేర్‌కు చెందిన 5 వేల కోట్ల రూపాయల విలువైన తాజా ఈక్విటీ ప్రతిపాదన కూడా ఉంది. కాడిలా హెల్త్ కేర్ తన కార్యకలాపాల విస్తరణ కోసం క్వాలిఫైడ్ సంస్థాగత ప్లేస్‌మెంట్ ద్వారా క్యుఐబిలకు షేర్లను విక్రయించడం ద్వారా 5 వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని అనుకుంటోంది. డిసెంబర్ 21న జరిగిన విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్‌ఐపిబి) సమావేశంలో చేసిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం రూ. 6,050.10 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించిందని గురువారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. భారత్‌లో పూర్తి స్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి రెసిఫార్మ్ పార్టిసిపేషన్ బివి చేసిన రూ. 1050 కోట్ల ప్రతిపాదన కూడా ఈ రోజు ఆమోదించిన వాటిలో ఉంది. కాగా ఆర్థిక వ్యవహారాల కార్యదర్వి శశికాంత్ దాస్ అధ్యక్షతన జరిగిన ఎఫ్‌ఐపిబి సమావేశం మరో ఆరు ఎఫ్‌డిఐ ప్రతిపాదనలను తిరస్కరించింది.
బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు
18 నుంచి అమలు : యుబిఐ
న్యూఢిల్లీ, జనవరి 14: కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ మొత్తాలతో కూడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.25 శాతం నుంచి 1.5 శాతం వరకు తగ్గిస్తున్నామని, ఈ రేట్లు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వ రంగంలోని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) గురువారం వెల్లడించింది. కోటి రూపాయల వరకు ఉండే డిపాజిట్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) నుంచి 50 బేసిస్ పాయింట్లు (0.5 శాతం) వరకు, కోటి రూపాయలు మించిన డిపాజిట్లపై వడ్డీ రేటును 0.25 నుంచి 1.5 శాతం వరకు తగ్గిస్తున్నామని, ఈ నెల 18వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తాయని యుబిఐ గురువారం స్టాక్ ఎక్స్‌చేంజికి తెలియజేసింది.

ఇన్ఫోసిస్ ఫలితాలు అదుర్స్

మూడో త్రైమాసికంలో రూ.3,465 కోట్లకు పెరిగిన నికర లాభాలు ౄ రాబడి రూ.15,902 కోట్లకు చేరిక
వార్షిక అంచనాలనూ సవరించుకున్న సంస్థ ౄ ఒక్క రోజే 5 శాతం పెరిగిన షేరు ధర

బెంగళూరు, జనవరి 14: దేశీయ ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ తన మూడో త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించిన పని తీరును ప్రదర్శించింది. కంపెనీ నికర లాభం 6.6 శాతం పెరగడమే కాకుండా తన వార్షిక రాబడి వృద్ధి అంచనాలను సైతం పెంచుకుంది. దీంతో గురువారం ఒక్క రోజే ఆ కంపెనీ స్టాక్ దాదాపు 5 శాతం పెరిగింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఇంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఉండిన రూ. 3,250 కోట్లతో పోలిస్తే రూ. 3,465 కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే ఒక్కో షేరుకు రూ. 15.16 పైసలు పెరిగినట్లు లెక్క. అంతేకాకుండా అధిక రాబడినిచ్చే ఆటోమేషన్, ఇతర సర్వీసులకు డిమాండ్ బాగా ఉండడంతో ఇన్ఫోసిస్ తన వార్షిక రెవిన్యూ వృద్ధి అంచనాను సవరించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి డాలర్లలో అమ్మకాలు 6.4 శాతంనుంచి 8.4 శాతం మధ్య పెరగవచ్చని కంపెనీ ఇంతకు ముందు అంచనా వేయగా, ఇప్పుడు ఆ వృద్ధి 8.9 శాతం 9.3 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది.
తన ప్రధాన ప్రత్యర్థి అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో పోలిస్తే ఇన్ఫోసిస్ అన్ని రంగాల్లోను గణనీయమైన వృద్ధిని సాధించింది. గురువారం త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టిసిఎస్ డాలరు రెవిన్యూ 0.3 శాతం తగ్గిపోయాయి. సీజనల్ హాలిడేలు, అమెరికాలో తాత్కాలిక సెలవులు, చెన్నైలో వరదలులాంటి కారణాల వల్ల టిసిఎస్ రాబడి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అది 8 శాతం వృద్ధి సాధించడం కూడా కష్టమే కావచ్చని భావిస్తున్నారు. కంపెనీ అనుసరించిన వినూత్నమైన పరిష్కారాలు, కొత్త టెక్నాలజీలు సంస్థ ఇంత బలమైన ఫలితాలు సాధించడానికి కారణాలని ఏడాదిన్నర క్రితం ఇన్ఫోసిస్ కొత్త సిఈఓగా బాధ్యతలు చేపట్టిన విశాల్ సిక్కా చెప్పారు. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రాబడి రూ. 13,796 కోట్లు ఉండగా, ఈ ఏడాది అది 15.2 శాతం పెరిగి రూ. 15,902 కోట్లకు చేరుకుంది. తమ అంచనాకన్నా మెరుగైన రీతిలో ఈ త్రైమాసికంలో తాము ముందుకు సాగగలిగామని ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎండి రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వాహక సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై తాము దృష్టి కొనసాగిస్తామని కూడా ఆయన తెలిపారు. క్లయింట్లు ఉండే చోట సెలవులు కారణంను, దేశంలో దీర్ఘకాలిక సీజనల్ సెలవుల కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం భారతీయ ఐటి కంపెనీలకు సాధారంణగా బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ ఇన్ఫోసిస్ అద్భుతమైన పని తీరును కనబర్చడం విశేషం. గత జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో కూడా ఇన్ఫోసిస్ కళ్లు చెదిరే ఫలితాలనే సాధించింది.
ఇదిలా ఉండగా మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కొత్తగా 75 క్లయింట్లను సంపాదించింది. దీంతో ఈ కంపెనీ మొత్తం క్లయింట్ల సంఖ్య 1,045కు చేరుకుంది. అలాగే ఈ త్రైమాసికంలో ఆ కంపెనీ కొత్తగా 5,407 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,93,383కు చేరుకుంది.

టోకు ధరల ద్రవ్యోల్బణం
మైనస్ 0.73 శాతం
ఆహార సరకులు మరింత ప్రియం
న్యూఢిల్లీ, జనవరి 14: వరసగా 14వ నెల డిసెంబర్‌లో కూడా టోకు ధరలు తగ్గాయి. అయితే ఆహార సరకుల ధరలు పెరగడంతో దాదాపు ఏడాది కాలంలోనే ఈ తగ్గుదల మందగతిలో ఉండడాన్ని బట్టి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు తప్పవేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నవంబర్‌నుంచి కూడా టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నెగెటివ్‌లోనే ఉండగా, గత నాలుగు నెలలుగా అది క్రమంగా పెరుగుతూ ఉంది. నవంబర్ నెలలో మైనస్ 1.99 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో మైనస్ 0.73 శాతానికి చేరుకుంది. అయితే 2014 డిసెంబర్‌లో ఇది మైనస్ 0.50 శాతంగా ఉండింది. నవంబర్ నెలలో 5.20 శాతంగా ఉండిన ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 8.17 శాతానికి పెరిగి పోయింది. పప్పులు, ఉల్లి, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు నవంబర్ నెలలో పారిమ్రిక ఉత్పత్తి వృద్ధి నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా 3.2 శాతానికి పడిపోవడంతో రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు పెరుగుతాయేమోననే భయాలు పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ వీటన్నిటినీ పరిగణనవోకి తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఫిక్కీ పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ తదుపరి ద్వైమాసిక ద్రవ్య సమీక్ష ఫిబ్రవరి 2న జరగాల్సి ఉంది.

ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత

24 నుండి కాకినాడలో రాష్టస్థ్రాయి శిక్షణ
ప్రముఖ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ రాక
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, జనవరి 14: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా రైతులను ప్రోత్సహించడానికి రాష్టస్థ్రాయి శిక్షణ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో వారం రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈనెల 24 నుండి 31వ తేదీ వరకు నగరంలోని సర్పవరం వ్యవసాయ ప్రాంగణంలో ‘ప్రకృతి వ్యవసాయ శిక్షణ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి సుమారు 5500 మంది రైతులు, అధికారులు, శాస్తవ్రేత్తలు శిక్షణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్తవ్రేత్త సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం చేయాలంటే అధిక పెట్టుబడులు గుదిబండగా మారాయి. వ్యవసాయానికి ఖర్చు అధిక మొత్తంలో అవుతున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాలు, చీడ, పీడల కారణంగా రైతాంగం తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. గోదావరి జిల్లాల్లో గత కొనే్నళ్లుగా రైతులు వరుస నష్టాలను చవిచూస్తున్నారు. ఎరువులు, పురుగుమందుల వాడకం కూడా అనూహ్యంగా పెరుగుతోంది. మరోవైపు నకిలీ పురుగు మందులు, ఎరువుల బెడద కూడా రైతాంగాన్ని పట్టిపీడిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కూడా అధిక ప్రచారం కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణ/అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. కాకినాడలో వారం రోజుల పాటు జరిగే ఈ రాష్టస్థ్రాయి శిక్షణ కార్యక్రమానికి 13 జిల్లాల నుండి రైతులు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కొక్క జిల్లా నుండి 300 రైతులు ఈ శిక్షణకు హాజరవుతారు. శిక్షణకు హాజరైన రైతులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజేయడంతో సాగులో మెళకువలు, జాగ్రత్తలు వివరిస్తారు. పురుగుమందులు, ఎరువులు వాడకుండా ఆవుపేడ, మూత్రం, మొక్కల కషాయాలతో వ్యవసాయం చేసి, ఏ విధంగా అధిక దిగుబడులు సాధించవచ్చో ఈ శిక్షణలో వివరిస్తారు.

13 శాతం తగ్గనున్న ఎగుమతులు
13 శాతం తగ్గనున్న ఎగుమతులు
13 శాతం తగ్గనున్న ఎగుమతులు

ఈ ఏడాది 270 బిలియన్ డాలర్లకే పరిమితం ౄ 125 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు

న్యూఢిల్లీ, జనవరి 14: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఎగుమతులు దాదాపు 13 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని, అంతర్జాతీయంగా డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గత ఏడాది మన దేశం నుంచి 310.5 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య ఎగుమతులు జరిగాయి. అయితే ఈసారి ఇవి 270 బిలియన్ డాలర్లు దాటడం కూడా కష్టమేనని భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), భారత వాణిజ్య, పరిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ) సహా వివిధ చాంబర్లతో ఇటీవల జరిపిన సంభాషణల్లో కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా తియోతియా ప్రజెంటేషన్ ద్వారా వివరించినట్లు ఆ అధికారి తెలిపారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 270 బిలియన్ డాలర్ల కంటే తక్కువ ఎగుమతులు జరిపిందని, వీటి విలువ దాదాపు 210 బిలియన్ డాలర్లుగా ఉందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఓ) వెల్లడించింది. అయితే 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన దేశం దాదాపు 390 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుపుకుంటుందని, దీంతో ప్రస్తుతం సుమారు 120 నుంచి 125 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడుతుందని తియోతియా పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో మన దేశ ఎగుమతులు 18.46 శాతం తగ్గి 174.3 బిలియన్ డాలర్లకు క్షీణించగా, 261.8 బిలియన్ డాలర్ల దిగుమతులు జరిగాయి. దీంతో 87.5 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటు ఏర్పడింది. ఎగుమతులు క్షీణించడం ఉపాధి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎగుమతుల విషయమై భారత్‌లో ఎటువంటి ‘సంక్షోభం’ లేదని, కనుక దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన నేపథ్యంలో తియోతియా చెబుతున్న గణాంకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులను మినహాయిస్తే మన దేశ ఎగుమతుల క్షీణత 9.6 శాతం (డాలర్లలో) గానే ఉంటుందని వాణిజ్య శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఈ సమావేశంలో వివిధ చాంబర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. తయారీ, ఎగుమతుల రంగాలకు ఊతమిచ్చి మొత్తం మీద ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన మార్గాలను వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

ఉత్సాహం ఇవ్వని ఇన్ఫోసిస్ ఫలితాలు
81 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్

ముంబయి, జనవరి 14: ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో త్రైమాసిక ఫలితాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే ముగిసాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ 81 పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం దాదాపు 26 పాయింట్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మరో 44 పైసలు పతనమై రూ. 67.29 పైసల స్థాయికి చేరుకుంది. మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ నికర లాభం 6.6 శాతం పెరిగి రూ. 3,465 కోట్ల రూపాయలకు పెరగడంతో ఆ కంపెనీ షేరు 6.6 శాతం పెరిగింది. అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం గమనార్హం. మరోవైపు ఆహార సరకులు, ప్రధానంగా కూరగాయల ధరలు పెరగడంతో డిసెంబర్ నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సైతం కొద్దిగా పెరిగి మైనస్ 0.73 శాతానికి చేరుకుంది. వీటన్నిటికీ తోడు అంతర్జాతీయ మార్కెట్లలో సైతం బలహీన ధోరణులు కనిపిస్తూ ఉండడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించిందని బ్రోకర్లు అంటున్నారు.
ఫలితంగా నిన్నటి ముగింపుకన్నా 300 పాయింట్లు తక్కువగా 24,473 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో ఒక దశలో 25 వేల పాయింట్లను దాటింది. అయితే చివరికి 81 పాయింట్ల నష్టంతో 24,772,97 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ బుధవారం 172 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 25.60 పాయింట్లు నష్టపోయి 7536.80 పాయింట్ల వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఎస్‌బిఐ, ఎల్‌అండ్‌టి, గెయిల్, హీరో మోటోకార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోగా, ఏసియన్ పెయింట్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, ఒఎన్‌జిసి షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు నష్టపోగా, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ మాత్రం లాభపడింది. ప్రాన్స్, జర్మనీ, బ్రిటన్‌లాంటి ప్రధాన ఐరోపా మార్కెట్ల సూచీలు కూడా భారీగా నష్టపోయాయి.