బిజినెస్

హెచ్‌యుఎల్ లాభం రూ. 1,090 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, మే 9: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.02 శాతం పెరిగింది. 1,089.59 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 1,018.08 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో హెచ్‌యుఎల్ స్పష్టం చేసింది. ఆదాయం విషయానికొస్తే ఈసారి నికర అమ్మకాలు 3.36 శాతం పెరిగి 7,809.40 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు 7,555 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇక సంస్థ లాభం ఏకీకృత ఆధారంగా చూస్తే ఈ జనవరి-మార్చిలో 6.43 శాతం క్షీణించి 4,082.42 కోట్ల రూపాయలుగా, నిరుడు 4,363.08 కోట్ల రూపాయలుగా ఉంది. నికర అమ్మకాలు మాత్రం 4.11 శాతం ఎగిసి 31,199.72 కోట్ల రూపాయల నుంచి 32,482.72 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇదిలావుంటే ఈ మార్చి 31తో ముగిసిన మొత్తం గత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేర్‌పై 9.50 రూపాయల తుది డివిడెండ్‌ను సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో హెచ్‌యుఎల్ ఆమోదించింది.
వర్ధమాన్ టెక్స్‌టైల్స్ లాభం రెండింతలు
వర్ధమాన్ టెక్స్‌టైల్స్ నికర లాభం ఈ జనవరి-మార్చిలో రెండింతలకుపైగా పెరిగింది. 217.49 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 90.2 కోట్ల రూపాయలుగానే సంస్థ లాభం ఉంది. అయినప్పటికీ నికర అమ్మకాలు ఈసారి 1.26 శాతం తగ్గడం గమనార్హం. క్రిందటిసారితో పోల్చితే 1,407.79 కోట్ల రూపాయల నుంచి 1,389.93 కోట్ల రూపాయలకు తగ్గాయి. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ లాభం 653.05 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 359.11 కోట్ల రూపాయలుగా ఉండగా, నికర అమ్మకాలు మాత్రం 5,742.03 కోట్ల రూపాయల నుంచి 5,587.14 కోట్ల రూపాయలకు తగ్గాయని సోమవారం సంస్థ పేర్కొంది.
క్షీణించిన ఐసిఐసిఐ లాంబార్డ్ లాభం
ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 8.5 శాతం క్షీణించింది. 119 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 130 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం గత ఆర్థిక సంవత్సరం లాభం కూడా 5.4 శాతం పడిపోయి 507 కోట్ల రూపాయలకే పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇది 536 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా. తమిళనాడులో సంభవించిన వరదలు సంస్థ లాభాన్ని దెబ్బతీశాయని సంస్థ పేర్కొంది. మునుపెన్నడూ లేనివిధంగా సంభవించిన భీకర వర్షాలకు ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగినది తెలిసిందే. దీంతో బీమా క్లయిమ్‌లు అధికంగా వచ్చినట్లు ఐసిఐసిఐ లాంబార్డ్ సోమవారం తెలియజేసింది.
సగానికి పడిపోయన ఆల్‌స్టమ్ లాభం
ఆల్‌స్టమ్ ఇండియా నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో 62 శాతం క్షీణించి 27.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. పోయనసారి 71.93 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 373.25 కోట్ల రూపాయలుగా నమోదైంది. క్రిందటిసారి 808.35 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సోమవారం చెప్పింది.