బిజినెస్

సిక్కా రాజీనామాకు ఆయనే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామాకు కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణమూర్తి ‘నిరంతర విమర్శలే’ కారణమని ఆ కంపెనీ బోర్డు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సిక్కా నాయకత్వంలో కంపెనీ రెవిన్యూ పరంగా మంచి ఫలితాలనే సాధించిందని కూడా బోర్డు ప్రశంసించింది. కంపెనీలో కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలు పడిపోతున్నాయంటూ నారాయణమూర్తి సంతకంతో ఒక లేఖ విడుదలైన విషయాన్ని బోర్డు బైట పెట్టింది. బోర్డు, మేనేజిమెంట్ నిజాయితీని దెబ్బతీసే విధంగా ఉన్న ఆ లేఖ పలు మీడియా సంస్థల చేతుల్లోకి వెళ్లిందని బోర్డు పేర్కొంది. ‘నారాయణమూర్తి లేఖలో కొన్ని వాస్తవ దోషాలతో పాటుగా అప్పటికే ప్రచారంలో ఉన్న కొన్ని పుకార్లున్నాయి. బోర్డు సభ్యుల సంభాషణలనుంచి ఏరుకుని తయారు చేసిన స్టేట్‌మెంట్ కూడా దానిలో ఉంది’ అని బోర్డు తీవ్ర పదజాలంతో కూడిన ఆ ప్రకటనలో పేర్కొంది.
నారాయణమూర్తి పలుమార్లు సాధ్యం కాని డిమాండ్లు చేశారని, ఆయన కోరుకున్న బలమైన కార్పొరేట్ పాలనకు, ఆ డిమాండ్లకు ఎలాంటి పొంతనా లేదని బోర్డు దుయ్యబట్టింది. రానురాను నారాయణమూర్తి ‘ప్రచారం’ మరింత తీవ్రమైందని విమర్శించింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 12.75 శాతం వాటా ఉన్న వ్యవస్థాపకుల సమస్యలను పరిష్కరించడానికి బోర్డు శాయశక్తులా ప్రయత్నించిందని, ఏడాది పాటు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయిందని బోర్డు తెలిపింది. మూర్తి ఆరోపణలు, హెచ్చరికల కారణంగా కంపెనీ తీవ్రంగా నష్టపోతోందని బోర్డు హెచ్చరించింది. ‘అయితే మూర్తి చేస్తున్న ప్రచారం వల్ల కంపెనీ పక్కదారి పట్టబోదు. అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్ పరిపాలనా ప్రమాణాలకే కట్టుబడి ఉంటుంది’ అని షేర్‌హోల్డర్లు, వినియోగదారులు, కస్టమర్లకు బోర్డు స్పష్టం చేసింది.

చిత్రం..ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్.నారాయణమూర్తి