బిజినెస్

బైబ్యాక్ ఆలోచనలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామా చేసినప్పటికీ బైబ్యాక్ ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని కంపెనీ శుక్రవారం స్పష్టం చేసింది. షేర్ల బైబ్యాక్ ద్వారా వాటాదారులకు రూ. 13 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కల్పించాలని ఇన్ఫోసిస్ ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కంపెనీ బోర్డు శనివారం సమావేశం కావలసి ఉంది.‘బైబ్యాక్ ప్రణాళికలో ఎలాంటి మార్పూ లేదు. షేర్‌హోల్డర్లకు ఎప్పుడు, ఎంతమేరకు నగదు ప్రయోజనం కల్పించాలనే దానిపై మేము ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం’ అని ఇన్ఫోసిస్ బోర్డు చైర్మన్ ఆర్ శేషశాయి శుక్రవారం విలేఖరులకు చెప్పారు. అంతేకాదు, ఇప్పటికే మొదలైన ఏ అంశాన్ని నిలిపివేసే ప్రసక్తి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా శేషశాయి స్పష్టం చేశారు.