బిజినెస్

తాత్కాలిక సిఇఓగా ప్రవీణ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఇన్ఫోసిస్ సిఇఓ, ఎండి పదవులకు విశాల్ సిక్కా రాజీనామా చేయడంతో ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ)గా సేవలందిస్తున్న ప్రవీణ్ రావును తాత్కాలిక సిఇఓగా నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోగా సంస్థకు కొత్త సిఇఓను, ఎండిని నియమిస్తామని, అప్పటివరకు విశాల్ సిక్కా ఏడాదికి ఒక డాలరు వేతనంతో సంస్థకు ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్‌గా కొనసాగుతారని ఇన్ఫోసిస్ వెల్లడించింది. బెంగళూరు యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ప్రవీణ్ 1986లో ఇన్ఫోసిస్‌లో చేరారు. సుదీర్ఘ కాలం నుంచి సంస్థకు సేవలందిస్తున్న ప్రవీణ్ పలు కీలక పదవుల్లో పనిచేశారు. మేనేజ్‌మెంట్ సర్వీసెస్, రిటైల్, కన్స్యూమర్ ప్యాకేజ్ గూడ్స్‌కు హెడ్‌గా, యూరప్‌కు డెలివరీ హెడ్‌గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఇన్ఫోసిస్ బిపిఓకి చైర్మన్‌గా ఉన్న ఆయన భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) జాతీయ కౌన్సిల్‌లోనూ, నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో సభ్యునిగా ఉన్నారు.