బిజినెస్

వ్యాపారాన్ని మరింత సరళతరం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సరళీకృత వ్యాపార విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో సంస్కరణలు తీసుకువస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ నేతృత్వంలో శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇప్పటికే 372 సంస్కరణలను ప్రతిపాదించామని, వీటిలో 315 సంస్కరణలు అమల్లోకి వచ్చాయని సింగ్ గుర్తు చేశారు. మిగిలిన 57 సంస్కరణలను అమలు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సరళీకృత వ్యాపార విధానాలను అమలు చేస్తున్న వివిధ శాఖలు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సమావేశాలు, వర్క్‌షాప్‌ల ద్వారా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, బిఆర్ మీనా, ముఖ్యకార్యదర్శులు సునీల్ శర్మ, జయేష్ రంజన్, రజత్ కుమార్, శశాంక్ గోయల్, వికాస్‌రాజ్, పౌరసరఫరా శాఖ కమిషనర్ సివి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.