బిజినెస్

షేర్ బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఇన్ఫోసిస్ బోర్డు షేర్ బైబ్యాక్ ఆఫర్‌ను ఆమోదించింది. 13,000 కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ ప్లాన్‌కు శనివారం ఇన్ఫోసిస్ పచ్చజెండా ఊపింది. సంస్థ సిఇఒ విశాల్ సిక్కా శుక్రవారం రాజీనామా చేసిన నేపథ్యంలో బోర్డు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. సిక్కా పనితీరు, ఆయనకు ఇస్తున్న వేతనంపట్ల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్‌ఆర్ నారాయణ మూర్తి తదితరులు చేస్తున్న విమర్శల మధ్య సిఇఒగా సిక్కా తప్పుకున్నారు. ఇకపోతే ఒక్కో షేర్‌ను 1,150 రూపాయల చొప్పున మొత్తం 11.3 కోట్ల షేర్లను ఈ బైబ్యాక్ ఆఫర్‌లో భాగంగా భాగస్వాముల నుంచి ఇన్ఫోసిస్ తిరిగి కొనుగోలు చేయనుంది. దేశీయ స్టాక్ మార్కెట్‌లో శుక్రవారం ట్రేడింగ్ ముగిశాక ఇన్ఫోసిస్ షేర్ విలువ 923.10 రూపాయల వద్ద ఉంది. దీంతో ఈ బైబ్యాక్ ఆఫర్‌లో భాగస్వాములకు ఒక్కో షేర్‌పై 25 శాతం అదనంగా సొమ్ము రానుంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) కూడా 16,000 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్ ఆఫర్‌ను ప్రకటించినది తెలిసిందే. ఇదిలావుంటే ఇన్ఫోసిస్‌పై నాలుగు అమెరికా లా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఫెడరల్ సెక్యూరిటీస్ చట్టాల నిబంధనలను సంస్థగానీ, దాని డైరెక్టర్లుగానీ ఉల్లంఘించారా? అన్నదానిపై ఇన్ఫోసిస్ భాగస్వాముల తరఫున ఈ దర్యాప్తు చేస్తున్నట్లు సదరు చట్ట సంస్థలు పేర్కొన్నాయి.