బిజినెస్

జిఎస్‌టి రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రిటర్న్స్ దాఖలు గడువును శనివారం మరో 5 రోజులు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తీవ్ర రద్దీతో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా జిఎస్‌టిఎన్ పోర్టల్ మొరాయించింది. ఈ క్రమంలోనే ఈ నెల 25 వరకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఓవర్‌లోడ్‌తో చిన్న సాంకేతిక సమస్య ఎదురైందని జిఎస్‌టిఎన్ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు. ఈలోగా అందరూ జిఎస్‌టి రిటర్న్స్‌ను దాఖలు చేయాలని ఆయన కోరారు. గత నెల జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమల్లోకి వచ్చినది తెలిసిందే. ఈ చారిత్రక పన్నులో 0,3,5,12,18,28 శ్లాబుల్లో పన్ను రేట్లను నిర్ణయించారు.