బిజినెస్

రేపు బ్యాంకులు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశవ్యాప్తంగా మంగళవారం బంద్ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బ్యాంకుల విలీనంపై నిరసనగా, ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. 9 బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు యుఎఫ్‌బియు నాయకత్వం వహిస్తోంది. వీటిలో అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఎఐబిఒసి), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ), బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సమాఖ్య (ఎన్‌ఒబిడబ్ల్యు) తదితర సంఘాలున్నాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. అయితే ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, కొటక్ మహీంద్ర తదితర ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగకపోవచ్చు. కానీ చెక్ క్లియరెన్స్‌లకు ఇబ్బంది ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, చీఫ్ లేబర్ కమిషనర్‌తో రాజీ చర్చలు విఫలమయ్యాయని, ప్రభుత్వం నుంచి, బ్యాంక్ యాజమాన్యాల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో బంద్‌కు దిగుతున్నట్లు ఎఐబిఒసి ప్రధాన కార్యదర్శి డిటి ఫ్రాంకో తెలిపారు.