బిజినెస్

హెయిర్ ప్రాసెసింగ్ యూనిట్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఆగస్టు 20: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ఓ హెయిర్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఆదివారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన జుత్తు కాలిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ వై హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని గాయత్రి హెయిర్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. దీంతో మంటలు చెలరేగాయ. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో అయిదు టన్నుల జుత్తు కాలిపోయంది. దీని విలువ 6 కోట్ల రూపాయలుగా ఉండగా, ప్రమాద సమయంలో యూనిట్‌లో తొమ్మిదిన్నర టన్నుల జుత్తు నిల్వలున్నాయి. మిగిలిన జుత్తును రక్షించడంతో మరింత నష్టం వాటిల్లకుండా నివారించగలిగారు. స్థానిక ఫైర్ ఆఫీసర్ సత్యానందం సమాచారంతో ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించగా, యూనిట్ అధినేత మారిశెట్టి వెంకటేశ్వరరావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణ సిఐ పి ప్రసాదరావు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

చిత్రం..అగ్నిప్రమాదంలో దగ్ధమైన జుత్తు