బిజినెస్

ఇక ‘టెక్’ పోస్ట్ఫాసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్‌లోని తపాలా కార్యాలయాలు ఇక పూర్తిగా టెక్నాలజీతో కళకళలాడనున్నాయి. టెక్నాలజీ ద్వారా తపాలా కార్యాలయాల్లోని ఖాతాదారులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని 10,323 తపాలా కార్యాలయాల్లోని సేవలు క్షణాల్లోనే అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తపాలా కార్యాలయాల పై ప్రత్యేక దృష్టిసారించినది తెలిసిందే. 2014లో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటల్ పింఛన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను తపాలా కార్యాలయాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతేగాక సామాన్య, మధ్యతరగతి వారు తపాలా కార్యాలయాల్లో అతి తక్కువ సొమ్ము అంటే కేవలం 50 రూపాయలతో ఖాతా తెరుచుకునే వెసులుబాటు కల్పించారు. అలాగే ఎన్‌ఆర్‌ఇజిఎస్ సొమ్ములను పోస్టల్ ఖాతాలకు జమచేస్తున్నారు. తాజాగా 12 రకాల సేవలను కోర్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ (సిఎస్‌ఐ) విధానం ద్వారా ఒకచోటికి తీసుకువచ్చింది. ఉదాహరణకు ఒక రిజిస్టర్డ్ పోస్టు లేదా స్పీడ్ పోస్టు చేస్తే ఆ లేఖపై ఉన్న ఫ్రమ్ అడ్రస్సు వారికి బుక్ చేసుకున్న వెంటనే, ఆ లేఖ అందిన తర్వాత ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. అంతేగాకుండ పోస్టుచేసిన నాటి నుంచి ఆ లేఖ ఎక్కడ ఉందో స్వయంగా తెలుసుకునే అవకాశం ఈ సిఎస్‌ఐ ద్వారా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రథమంగా మచిలీపట్నం, భీమవరం, హిందూపురం, చిత్తూరులో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని 59 హెడ్ పోస్ట్ఫాసులతోపాటు 1,525 సబ్-పోస్ట్ఫాసుల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. మెయిల్, ఇంటర్నేషనల్ మెయిల్, ఇ-పేమెంట్, స్టాంప్స్ విక్రయాలు, ప్రొడక్టు సేల్స్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ (ఐపిఒ), మనీ రెమిటెన్స్ సేవలు, ఫైనాన్స్, డొమెస్టిక్ కంపోజ్ అండ్ బుక్, ఇంటర్నేషనల్ కంపోజ్ అండ్ బుక్, ఫ్రాంక్లిన్ మెషీన్ సేవలు వీటి పరిధిలోకి వస్తాయి. ఇక రాష్ట్రంలో ఉన్న 8,739 బ్రాంచ్ కార్యాలయాల్లో రూరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఆర్‌ఐసిటి) ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు.

చిత్రం..భీమవరం హెడ్ పోస్ట్ఫాసులో సిఎస్‌ఐ సేవలను ప్రారంభిస్తున్న ఎస్‌ఎస్‌పి మునిరామయ్య